పవన్ చిరంజీవిని అవమానిస్తున్నారా.. తమ్ముడి కోసం అన్న పలికేనా?

Pawan Kalyan talks about Prajarajyam and Chiranjeevi

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, చిరంజీవి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయాలే ఈ ఇద్దరు అన్నాదమ్ముల మధ్య చిచ్చు పెట్టాయని సమాచారం. చిరంజీవి జగన్ కు అనుకూలంగా ఉండటం పవన్ కళ్యాణ్ కు అస్సలు నచ్చడం లేదని బోగట్టా. జనసేనకు పవన్ మద్దతు ఇవ్వాలని జనసైనికులు కోరుకున్నా చిరంజీవి మాత్రం అస్సలు స్పందించడం లేదు.

చిరంజీవితో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో కావడానికి చిరంజీవి బ్యాగ్రౌండ్ కారణమని చెప్పవచ్చు. చిరంజీవికి ఉన్న ఊహించని స్థాయి ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ సక్సెస్ కు ఒక విధంగా కారణమైంది. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. అయితే చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కు అస్సలు నచ్చలేదు.

ప్రజారాజ్యం పార్టీ విలీనం సమయంలోనే చిరంజీవికి పవన్ తో బేదాభిప్రాయాలు ఉన్నాయని కూడా వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం. జనసేన పార్టీని పవన్ స్థాపించడం చిరంజీవికి అస్సలు ఇష్టం లేదని బోగట్టా. అయితే ఏ సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి కామెంట్లు చేయడానికి చిరంజీవి ఇష్టపడలేదు. అయితే చిరంజీవిని పవన్ కళ్యాణ్ మాత్రం పలు సందర్భాల్లో అవమానిపిస్తున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది విమర్శలు చేస్తున్నా జగన్ పేరును అడ్డు పెట్టుకుని పవన్ చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి తనకు మద్దతు ఇచ్చి ఉంటే మాత్రం జనసేన మెరుగైన ఫలితాలను అందుకుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ కారణం వల్లే చిరంజీవి పవన్ మధ్య దూరం పెరిగింది. తమ్ముడు జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.