ఏపీ లో పంచాయతీ ఎన్నికలపై ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలిచ్చారు. పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెదటి దశను నాలుగో దశగా, రెండో దశ ఎన్నికలను మొదటి దశకు మార్చారు. అలాగే మూడో దశను రెండో దశకు మార్చారు.
నాలుగో దశను మూడో దశకు మార్చిన ఎస్ఈసీ.. మొదటి దశను నాలుగో దశకు రీషెడ్యూల్ చేశారు. రీ షెడ్యూల్ చేసిన ప్రకారం మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈనెల 29కి వాయిదా వేశారు. నిమ్మగడ్డ రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13,17,21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కాకపోవడమే రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. రీషెడ్యూల్ వివరాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు పంపించారు. దీనిపై జిల్లా అధికారులతో కాసేపట్లో సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన వెంటనే యాక్షన్ ప్లాన్ లోకి దిగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, తన ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ పై దృష్టి పెట్టిన ఆయన, సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూశారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు.