రాయలసీమ ప్రజల ఆందోళన ఇంకా ఉద్యమం రూపం తీసుకోవలసి ఉంది. దీనికోసం ఎంతో మంది యువకులు కృషి చేస్తున్నారు. రాయలసీమ హృదయాన్ని గాయపరిచే ప్రతిచర్యను ప్రతిఘటిస్తున్నారు. ఇలాంటి వాళ్లలో జలం శీను ఒకరు. శీను కమిట్ మెంటు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలు స్వార్థం కోసం సీమ వ్యథని వాడుకుంటున్నపుడు శీను జలం కోసం జనం తరుఫున నిలబడ్డారు. ఇదే కోవకు చెందిన వాళ్లు రాజ రాయలసీమ, సీమ కృష్ణ. రే పటి రాయలసీమ ఉద్యమానికి బాట వేస్తున్నవాళ్లలో ఈ ముగ్గురు చాలా ముఖ్యలు. అయితే, వీరంతా ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో జలం శీను మృతిచెందాడు. తెలంగాణ అనంతరం రాయలసీమ ఉద్యమంలో తొలి అమరుడయ్యాడు. ఈ మరణం రాయలసీమ కు తీరని లోటు. ప్రమాదంలో గాయపడ్డ మిగతా వాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జలం శీను కు రాయలసీమ మిత్రులు నివాళులర్పిస్తున్నారు.
జలం శీను ఎవరు?
కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూరు నివాసి. బహుజనుడైన శీను తన సామాజికవర్గ సమస్యలతో పాటు రాయలసీమ ఉద్యమంలో కీలకంగా ఉంటూ గుర్తింపు పొందాడు. రాయలసీమలో లేని జలం ఆయన ఇంటి పేరైంది. చివరికి ఉద్యమబాటలోనే తుదిశ్వాస విడిచి రాయలసీమ సమాజానికి కన్నీళ్లు మిగిల్చాడు. కాని ఆయనకు మరణం ఉండొచ్చు… శీను ఆశయానికి మాత్రం ఎప్పటికీ మరణం ఉండదు. భార్య, ఇద్దరు చిన్న ఆడబిడ్డలు శీను మరణంతో ఒంటరి అయ్యారు. వారికి అండదండగా ఉండాల్సిన బాధ్యత రాయలసీమ సమాజంపై ఉంది.
“అరవింద సమేత వీర రాఘవ” సినిమా ద్వారా పాతపుండ్లను గెలుకుతున్నారని, లేని జీవితాన్నిచూపుతూ రాయలసీమ మనసులను గాయపరుస్తున్నారని తమ నిరసనను వ్యక్తం చేసేందుకు వెళుతూ తీవ్ర గాయాలపాలైన వారిలో సీమ కృష్ణ, రాజా రాయలసీమ, రవికుమార్ కూడా ఉన్నారు. సీమ కృష్ణ నాయక్‌ది కర్నూలుజిల్లా అవుకు మండలం. ప్రస్తుతం అనంతపురంలో నివాసం. అలాగే రవికుమార్‌ది కర్నూలు, రాజా రాయలసీమది గుత్తి. వీరంతా గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహబూబ్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం భౌతికపరమైంది. కాని నిత్యం రాయలసీమ ప్రజానీకంపై రాజకీయ, సినీవర్గాల వారు సాంస్కృతిక, మానసిక దాడులకు పాల్పడుతూ ఆ ప్రాంత ప్రజల మనసులను తీవ్రగాయాలపాలు చేస్తూనే ఉన్నారు. వారి ఆగడాలను, వికృత చేష్టలను తిప్పికొట్టే క్రమంలో నలుగురు యువకులు రాయలసీమ సమాజ బాధ, ఆవేదన, ఆక్రందనలను భారంగా మోసుకెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. (కర్టసీ: తెలుగు ఎక్స్ ప్రెస్)
సీమ గొంతులు ఒక్కటైతున్న వేల ఓ గొంతు మూగబోయినది
రాయలసీమ పై పాలకుల వివక్ష కు వ్యతిరేకంగా గడిచిన కొంతకాలంగా సీమలోని యువకులు గళం విప్పుతున్నారు. పార్టీలు , కులాలకు అతీతంగా ఒక్కటీ అవుతున్నారు. రాయలసీమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో16 న దీక్షకు ఏర్పాట్లు, 27 న మైసురా రెడ్డి అస్తిత్వం పేరుతో వ్రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం, ఈ మధ్యనే విడుదలైన అరవింద సమేత వీర రాఘవ సినిమా లో రాయలసీమ పై విషం గక్కే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి హైదరాబాద్ కేంద్రంగా యువకులు చేసిన ప్రయత్నం సమాజాన్ని ఆలోచింప చేసింది
సీమ పేరుతో మాట్లాడటానికి ఇష్టపడని వారు నేడు గర్వంగా రాయలసీమ పేరుతో మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో రాయలసీమ కోసం పోరాడుతున్న జలం శీను ఉద్యమం లో భాగంగా ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదం. వారి మరణం సీమ ఉద్యమానికి తీరని నష్టం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ప్రయాణం లో గాయపడిన రవి, కృష్ణ, రాజా లు త్వరలోనే కోలుకుని మనలో ఒక్కడిగా మునుపటి తరహాలో ఉండాలని రాయలసీమ విద్యావంతలు వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి (తిరుపతి) ఆకాంక్షించారు.
సాయం కోసం అభ్యర్థన
ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్ర గాయాలుపాలు కావడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది నిజమే. ఈ ఘటన రాయలసీమలోని అన్నివర్గాల ప్రజలను తీవ్రంగా కదిలించింది, కలచివేసింది. రాయలసీమ ప్రజానీకం బాధను తన బాధగా రాయలసీమ ఎక్స్‌ప్రెస్ భావిస్తోంది. బాధితుల కుటుంబ సభ్యుల్లో తానొకటిగా ఈ వెబ్‌సైట్ తల్లడిల్లుతోంది. బాధితుల ఆశయాల సాధనకు అండగా ఉంటామని హామీనిస్తూ…
రాయలసీమ కోసం పోరాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిత్రుల సహాయం కోసం అభ్యర్థన
Please find the details and do needful.
Citi bank 5228865558
Malapati ashok vardhan reddy
IFSC : CITI0000006