Naveen Chandra: నవీన్ చంద్ర మొదట అరవింద సమేత సినిమాలో చెయ్యను అన్నాడు.. నటుడు రాజ రవీంద్ర కామెంట్స్!

Naveen Chandra: సినిమాలో నవీన్ చంద్ర మెయిన్ క్యారెక్టర్ చేసి, చాలా కష్టపడి ఆ తర్వాత అది అంతగా ప్రేక్షకాదరణ పొంద లేకపోయేసరికి ఆయన డిప్రెస్ అయినట్టు ప్రముఖ నటుడు రాజా రవీంద్ర చెప్పారు. తనకు ఆయనకు ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తాను నవీన్ చంద్ర కు డేట్స్ ఇస్తున్నానని ఆయన తెలిపారు. తాను ఎప్పుడూ ఆయనకి డేట్స్ చెప్పలేదని, ఆయన టాలెంట్ ను బట్టి కరెక్ట్ గా జరిగిపోయాయని రాజా రవీంద్ర తెలిపారు. ఆయన ఎప్పుడు ఒక మెయిన్ క్యారెక్టర్ వస్తే తప్ప చేయననననే ఆలోచనతోనే స్థిరంగా ఉండాలని రాజా రవీంద్ర చెప్పారు.

ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర కు అవకాశం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ తాను చేయని చెప్పారని రాజా రవీంద్ర అన్నారు. కానీ తాను త్రివిక్రమ్ గారి సినిమా అంటే మీ ఇంపార్టెన్స్ లేకుండా అడగరని, మీరు ఓ పది సినిమాల్లో హీరోగా చేసినా కూడా అంతగా ప్రేక్షకులకు చేరువ కారని, తాను నవీన్ చంద్రతో అన్నట్టు రాజారవీంద్ర చెప్పారు. త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఆ పాత్రకు కచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుందని ఆయన వివరించినట్లు తెలిపారు. ఆ తర్వాత నవీన్ చంద్ర కూడా చాలా రోజులు ఆలోచించి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ను చేశారని రాజా రవీంద్ర అన్నారు.

ఆ తర్వాత ఆ సినిమాలో నటించింది చేసిన పాత్ర బాగా హిట్ కావడంతో ఆయనకు చాలా మంచి పేరు కూడా వచ్చిందని రాజా రవీంద్ర చెప్పారు. అంతే కాకుండా ఆయన ఆ తర్వాత చాలా బిజీ అయిపోయారని రవీంద్ర తెలిపారు. అంతేకాకుండా నవీన్ చంద్ర ఒక పండగ లేకుండా, ఒక రాత్రి, పగలు అని చూడకుండా చాలా కష్టపడతారని, సినిమాల్లో అవకాశాలు కూడా ఆయనకు వస్తూనే ఉన్నాయని, ప్రస్తుతం శంకర్ గారి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నారని రాజా రవీంద్ర వివరించారు.