ఎన్టీయార్ అభిమానులకు గుడ్ న్యూస్.! నమ్మొచ్చా.?

ఎన్టీయార్ కొరటాల మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా.? అని ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. అంతకంతకూ వెనక్కి పోతూనే వుంది. కానీ, ఏ అప్టేట్ రావడం లేదు.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఎన్టీయార్, కొరటాల మొదలెట్టేయనున్నారనీ తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా, ఆల్రెడీ పూజా కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కావల్సి వుంది.

ఇంతవరకూ హీరోయిన్ పేరు ఫైనల్ కాలేదు. కాగా, ఫిబ్రవరిలో ఓ నాలుగైదు రోజులు షూటింగ్ చేసేసి మమ అనిపించేసేలా మాట్లాడుకుంటున్నారు. అది కూడా హైద్రాబాద్ పరిసరాల్లోనేనట. దాంతో ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి తట్టుకోలేకే ఇలా చేయాలనుకుంటున్నారా.? అనే కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయ్.

మరోవైపు తూచ్.! ఇదంతా వుత్తదే.. సమ్మర్ తర్వాతే అసలు షూటింగ్.. ఈలోగా మొదలెట్టేదే లే.! అంటున్నారు. అసలే అసహనంతో వున్న ఎన్టీయార్ ఫ్యాన్స్‌కి అలాంటిదేదైనా జరిగితే, ఇక రచ్చ రచ్చే.!