యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎవరేజ్ టాక్ తో నడుస్తోంది. కొంతమంది బాగుందని అంటూ ఉంటే మరోకొంత మంది మాత్రం రామాయణం కథని చెడగొట్టారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఎలాంటి విమర్శలు చేసిన ప్రశంసలు ఇచ్చిన ఆదిపురుష్ కి ప్రస్తుతం అయితే మంచి ఆదరణ వస్తోంది.
వీకెండ్ పూర్తయిన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి రియాక్షన్ రానుంది అనేదానిని బట్టి సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని ఆదిపురుష్ అందుకోలేకపోయిన టాప్ 10లో మాత్రం నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ రాబట్టిన సినిమాలు చూసుకుంటే మొదటి స్థానంలో ఆర్ఆర్ఆర్ నిలిచింది.
ఈ చిత్రం 74.11 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రెండో స్థానంలో బాహుబలి 72.43 కోట్ల షేర్ తో నిలిచింది.మూడో స్థానంలో మెగాస్టర్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి 38.75 కోట్ల షేర్ సొంతం చేసుకొని నిలబడింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న సాహి 36.52 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదో స్థానంలో ఉన్న సర్కారువారిపాట మూవీ 36.01 కోట్ల షేర్ ని రాబట్టింది.
ఆరో స్థానంలో నిలిచిన ఆదిపురుష్ మూవీ 32.84 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇక ఏడో స్థానంలో సరిలేరు నీకెవ్వరూ మూవీ 32.77 కోట్ల గ్రాస్ తో నిలిచింది. ఎనిమిదో స్థానంలో 32.24 కోట్లతో వకీల్ సాబ్ ఉంది. తొమ్మిదో స్థానంలో ఉన్న ఆచార్య 29.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
పదో స్థానంలో ఎన్ఠీఆర్ అరవింద సమేత 26.64 కోట్ల సరే రాబట్టింది. అయితే ఆదిపురుష్ చిత్రాన్ని స్ట్రైట్ తెలుగు సినిమా క్రింద పరిగణించలేం. హిందీలో తెరకెక్కి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాగా చూడాల్సి ఉంటుంది. అలా చూస్తే డబ్బింగ్ సినిమాలలో హైయెస్ట్ షేర్ రాబట్టిన చిత్రంగా ఆదిపురుష్ నిలవడం విశేషం.