(శివ రాచర్ల)
రాజ రాయలసీమ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. Ravi Kumarని మరో 4 రోజుల్లో discharge చేస్తామని చెప్పారు. ఆర్.వి.యస్ సీమ కృష్ణ కు head surgery జరిగింది. తాను కూడా బాగున్నాడు,ఆహారం తీసుకుంటున్నాడు,మాట్లాడుతున్నాడు.
రవికి మొదట 2 surgeries అవసరం అవుతాయని చెప్పారు కానీ surgery లేకుండానే Lungs లో pipe ద్వారా blood ను drain out చేశారు. నిన్న pipe కూడా తొలగించారు. Orthopedic surgery కూడా అవసరం లేదన్నారు.
Accident లో కృష్ణకు తల మీద చర్మం లేచిపోయి మెదడు బయటకు కనిపించింది. కానీ skull లోపలి భాగంలో ఎలాంటి దెబ్బ తగలలేదు. Accident జరిగిన ప్రదేశం నుంచి మహబూబ్ నగర్ హాస్పటల్ కు తరలించిన పోలీసులు తీసుకున్న జాగర్తలు కృష్ణ ప్రాణాన్ని కాపాడాయి,వారు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా కృష్ణ మెదడుకు గాయం అయ్యేది.
Accident జరిగిన వెంటనే అనేక మంది స్పందించారు.నాకు ఆక్సిడెంట్ జరిగిన 2 గంటలకు తెలిసింది,వీరు ఎక్కడ ఉన్నారో కనుక్కోవటం తోలి ప్రాధాన్యత. గద్వాల్లో జర్నలిస్ట్ గా పనిచేసే మున్నూర్ సూరి తన పరిచయాలతో ఆక్సిడెంట్ అయినా వారు మహా బూబ్ నగర్ హాస్పటల్లో ఉన్నారని తెలుసుకొని Munnur Raviని అక్కడికి పంపించారు. రవి ఫోన్లో నేను రాజా,కృష్ణాలతో మాట్లాడాను.Thanks to Suri and Ravi.
మహబూబ్ నగర్ నుంచి వీరిని హైదరాబాద్ CARE కు తరలించారు.అక్కడ అశోక్ వీరి భాద్యత తీసుకొని రాత్రి అంతా హాస్పటల్లో ఉండి admission ,immediate care చూసుకున్నాడు. అశోక్ కు తోడుగా Raghav Indra,Vivek Reddy కూడా రాత్రంతా హాస్పటల్లో ఉన్నారు. ఉదయానికి పూనె నుంచి Sreekanth Sodum వొచ్చి గత 4 రోజులుగా వీరికి తోడుగా ఉన్నాడు.
Ram Chandra,Gopal Lingireddy గారు ,Kranthi Kumar Eragamreddyతదితరులు admission కు తక్షణ వైద్యానికి కావలసిన డబ్బును అప్పటికప్పుడు సమకూర్చారు.
ఆ రాత్రి తీవ్ర ఉద్విగ్నం గా గడిచింది. కనీసం 4 ఆపరేషన్లు అవసరం అవుతాయని,దాదాపు 10 లక్షలు బిల్ కు సిద్దపడమని చెప్పారు.
కృష్ణా head surgery చేపించటానికిి Mani Annapureddy ని తన మితుడై City Neuro center వారితో మాట్లాడారు.కానీ NIMS లో పనిచేసే రాజా వాళ్ళ పెద్దమ్మగారు కృష్ణా,రవి ఇద్దరినీ NIMS కు మారుద్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. CARE estimations కన్నా NIMSలో తక్కువకే treatment జరిగింది. ఇప్పుడు కృష్ణా , రవి ఇద్దరు బాగున్నారు. ఈ శనివారానికి ఇద్దరు discharge అవుతారు.
మరో వైపు జలం శ్రీను అంత్యక్రియ బాధ్యతలు KrishnaReddy Kanapuramసార్ చూసుకున్నారు. అంత్య క్రియలకు హాజరైన స్థానిక MLA కుటుంబ సభ్యులు CM Relief Fund నుంచి శ్రీను కుటుంబానికి సహాయం చేస్తామని ప్రకటించారు.
కొన్ని పదుల మంది మిత్రులు వివిధ మార్గాలలో కృష్ణ,రవి,రాజా లకు మద్దతుగా నిలిచారు.అశోక్ మరియు శ్రీకాంత్ హాస్పటల్లోనె రోజులు ఉండి వీరి బాధ్యతలు చూసుకున్నారు. వైద్యానికి కావలసిన నిధులను కృష్ణా రెడ్డి సార్,అశోక్,శ్రీకాంతులతో పాటు అమెరికా నుంచి Naresh Guvva,Giridhar Kanapuram మరియు నేను మిత్రుల నుంచి సేకరించాము.
కృష్ణ ,రవి discharge అయిన తరువాత మిగిలిన డబ్బులు జలం శ్రీను కుటుంబానికి ఇవ్వాలని అనుకుంటున్నాము,కృష్ణా రెడ్డి సార్, అశోక్ ,శ్రీకాంత్ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. మిత్రుల ద్వారా వొచ్చింది నిధులు,ఖర్చుల వివరాలు ప్రకటిస్తారు.
(ఫేస్ బుక్ వాల్ నుంచి )