అవిశ్వాసంపై జరిగిన చర్చలో టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు హై వోల్టేజి ప్రసంగం చేశారు. ఏపి సమస్యలపై అన్ని తప్పుడు సమాచారాలే చెబుతున్నారన్నారు. డిల్లీని తలదన్నే రాజధాని కడతామన్నారు ఏమైందని ప్రశ్నించారు. నిబంధనలను మార్చి ఏడు మండలాలను కలిపిన మీరు ఏపికి ప్రత్యేక హోదా కూడా అలాగే ఇవ్వాలన్నారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు హోదా ఇస్తున్నప్పుడు ఏపికి ఎందుకివ్వరని నిలదీశారు. ఒక ప్రధాని చెప్పిన మాటను ఇంకో ప్రధాని పట్టించుకోనప్పుడు ఈ చట్టాలేందుకని ప్రశ్నించారు. విశాఖకు రైల్వే జోన్ కోసం అన్ని అర్హతలు ఉన్నాయని, అయినా కేంద్రం ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలన్నారు. అప్పట్లో ఏపికి ప్రత్యేక హోదా కోసం అరుణ్ జైట్లీ , వెంకయ్య పోరాడారు. బిజెపి కూడా తన మేనిఫెస్టోలో హోదా అంశాన్ని చేర్చిందని రామ్మోహన్ గుర్తు చేశారు. ఆద్యంతం రామ్మోహన్ ప్రసంగం హాట్ హాట్ గా సాగింది.