బ్రేకింగ్ న్యూస్: పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ ప్రారంభం

పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ ప్రారంభమైంది. దీనిపై టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ చర్చ ప్రారంభించారు. మెదటి సారి ఎంపీ అయిన నేను అవిశ్వాసంపై చర్చించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. భరత్ అనే నేను సినిమాలోని టిమ్ వర్క్ ను ఉదాహరణగా చూపుతూ జయదేవ్ ప్రసంగించారు. ప్రభుత్వానికంటే ప్రతిపక్షాలకు ఎక్కువ సమయమివ్వాలని కాంగ్రెస్ కోరింది. సాయంత్రం ఆరుగంటల వరకు చర్చ కొనసాగే అవకాశం ఉంది. సభ నుంచి బిజెడి ఎంపీలు 19 మంది అవిశ్వాసంలో పాల్గొనమంటూ నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు.