కరోనా వైరస్ వ్యాప్తి ..లాక్ డౌన్ నేపథ్యంలో …వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి కొరానా తోకలిసి కొన్నాళ్లు పాటు ప్రయాణం చేయాల్సిందేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తర్వాత అదే మాటను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సమర్ధించారు. చేసేదేమి లేదు. లాక్ డౌన్ అంటూ ఎన్నాళ్లు ముందుకెళ్తాం. ఇప్పటికే ఆర్ధిక పరిస్థితి చితికిపోయింది. ఇంకా అన్నింటికీ తాళాలు వేసుకుని కుర్చుంటే పనవ్వదని చెప్పకనే చెప్పేసారు.
ఇంకా ఆర్ధిక నిపుణులు, సామాజిక వేత్తలు..సీనియర్ రిటైర్మెంట్ ప్రభుత్వ అధికారులు జెడీ లక్ష్మినారాయణ లాంటి వారు ఆ వ్యాఖ్యలను సమర్ధించారు. ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన వీడియా కాన్ఫరెన్స్ సమావేశంలో కూడా ఇవే విషయాలను ముఖ్యమంత్రులు చర్చించారు. తాజాగా గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా కరోనా కలిసి జీవించాల్సిందే. ఆ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్ధిస్తున్నట్లు వెల్లడించారు. ఓ పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా పై రాజకీయాలు…ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న సమయంలో గల్లా ఇలా వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
గల్లా మాటలు విన్న టీడీపీ నేతల నోట్లో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం టీడీపీ పనిగా పెట్టుకుంటే..ఈ ఎంపీగారు ఏంటి ఇలా నోరు జారారు అంటూ పార్టీ లో తీవ్రమైన చర్చకు దారి తీసిందిట. ఈ మాట సాయంతో బాబు గారి గుడెళ్లో రైలు పరిగెట్టినంత పనైందిట. ఇది మాట సాయం వరకేనా… లేక గల్లా జంపింగ్ ఆలోచన కూడా చేస్తున్నారా? అన్న అనుమానం బాబుగారికి కలిగిందిట. పార్టీల విషయం పక్కనబెడితే గల్లాది జెంటిల్ మెన్ శైలి. ఏ పార్టీపైనా అనవసరమైన ఆరోపణలు, కామెంట్లు చేయరు. ఎంత అవసరమో అంతే మాట్లాడుతారు. ఎదుటవారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉండవు. మిగతా టీడీపీ నేతలు కూడా గల్లాను చూసి కొద్దో గోప్పో నేర్చుకుంటే బాగుండేది.