జమ్మలమడుగులో తారాస్థాయికి చేరిన రాజాకీయం… తాడో పేడో తేల్చేయాలంటున్న రామసుబ్బారెడ్డి

ramasubbareddy wants to settle conflicts with sudheer reddy at cm

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గంలో వైసీపీ లో విభేదాలు తొలగిపోయేలా లేవు. తాజాగా రామసుబ్బారెడ్డి అనుచరుడు గురునాధరెడ్డి హత్యతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అధిష్టానం సరైన సమయంలో స్పందించకపోవడంతోనే రెండు వర్గాలు పరస్పరం దాడులుకు దిగాయంటున్నారు. గురునాధరెడ్డి హత్యతో రామసుబ్బారెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలిసింది. రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు. ఆయన తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ ప్రభావం ఎక్కువగా ఉండటం, టీడీపీ కి ఇబ్బందులు తలెత్తడంతో రామసుబ్బారెడ్డి వరస ఓటములను చవి చూస్తున్నారు. 2014 ఎన్నికలలో ఓటమి పాలయినా టీడీపీ అధికారంలోకి రావడంతో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవి పొంది నెట్టుకొచ్చారు.

ramasubbareddy wants to settle conflicts with sudheer reddy at cm
rama subbareddy vs sudheer reddy

చంద్రబాబు ఆదినారాయణరెడ్డిని వైసీపీలోకి తీసుకుని వచ్చి మంత్రిని చేయడంతో రామసుబ్బారెడ్డి టీడీపీలో ఇమడ లేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఆదినారాయణ రెడ్డి వర్గం సహకరించలేదు. దీంతో మరోసారి ఓటమి పాలయ్యారు. ఆయన ఇక టీడీపీలో ఉండి లాభం లేదనుకుని వైసీపీలో చేరారు. అయితే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇ‌ష్టం లేదు. దీంతో సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డితో సయోధ్యకు సుముఖత చూపలేదు.

ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. సుధీర్ రెడ్డి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు రామసుబ్బారెడ్డిని దూరంగా ఉంచడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని కడప జిల్లాకు జగన్ వచ్చిన సందర్భంలో రామసుబ్బారెడ్డి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో గండికోట నిర్వాసితుల రీసర్వేలో జరిగిన ఘర్షణలో రామసుబ్బారెడ్డి వర్గీయుడు మరణించారు. ఇప్పటి వరకూ ఓపిక పట్టిన రామసుబ్బారెడ్డి తన అనుచరుడు మరణించడంతో జగన్ వద్దనే ట్టాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా రామసుబ్బారెడ్డి సిద్ధమయినట్లు తెలుస్తోంది.బీజేపీ పార్టీలో చేరేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.