“37 – 14 = 23”… గ్యాప్ ఇవ్వకుండా వెంటాడుతున్న ఆర్జీవీ!

గతకొంతకాలంగా 23వ నెంబర్ ను చంద్రబాబును విడదీసి చూడలేని పరిస్థితి నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి అప్రజాస్వామికంగా చేర్చుకోవడం, ఆ తర్వాత వచ్చిన ఫలితాలు ఆ సంఖ్యను రిపీట్ చేయడంతో… “23” ఫిక్సయిపోయింది!

ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. దీంతో 7+6+9+1 = 23 అంటూ ఆన్ లైన్ లో సెటైర్స్ వేశారు దర్శకుడు రాం గోపాల్ వర్మ. 23 నెంబర్ తో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వెంటాడుతున్నారు అర్జీవి.

ఇందులో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లను గతకొంతకాలంగా తనదైన వెటకారంతో వెంటాడుతున్న వర్మ… పొత్తు కన్ ఫాం అనంతరం కలిసి వాయించేస్తున్నారు. ఇందులో భాగంగా ముగ్గురి బర్త్ డేలనూ కలిపి, అది 23కి సమానం అని చూపించారు.

ఈ నేపథ్యంలో తాజాగా.. “అమారావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కొడుకు లోకేష్ ఏ14, స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు ఏ37…37 – 14 = 23! దేవుడు, దెయ్యానికి మాత్రమే తెలుసు చంద్రబాబుకు, 23 కు ఉన్న కనెక్షన్ ఏమిటనేది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో 23 పేరు చెప్పి ఈ స్థాయిలో వెంటాడుతున్నారేమిటనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా… గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ల బర్త్ డే లను కలిపిన వర్మ… వాటి మొత్తం 23 అని సూచించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా…

చంద్రబాబు పుట్టిన తేదీ… 20-4-1950 (2+0+4+1+9+5+0=21) => 2+1=3

లోకేష్ పుట్టిన తేదీ… 23-1-1983 (2+3+1+1+9+8+3=27) => 2+7=9

పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ… 2-9-1971 (2+9+1+9+7+1=29) => 2+9=11

వీటిని కలిపితే… 3+9+11=23 అని ముగించారు!