పవన్ కి పరీక్ష పెట్టిన ఆర్జీవీ… తొమ్మిది ప్రశ్నల వ్యూహం ఇదే?

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, త్వరలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వివరాలు మొదలైన వాటిచుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిన విషయంపై పవన్ కల్యాణ్ ఏపీ సర్కార్ పై ఫైరయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పవన్ కు పరీక్ష పెట్టారు ఆర్జీవీ.

చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అవినీతి కేసులో అరెస్టు చేయడం, ఆపై కోర్టు సూచనల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాడ్ కు తరలించడం మొదలైన అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వపైనా, సీఎం జగన్ పైనా తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు రాం గోపాల్ వర్మ ఆన్ లైన్ వేదికగా తొమ్మిది ప్రశ్నలు సంధించారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో పవన్ కు ఒక పరీక్ష పెట్టిన దర్శకుడు రాం గోపాల్ వర్మ… “గౌరవనీయులైన శ్రీ పవన్ కల్యాణ్ గారూ, నా ఈ క్రింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్” అంటూ మొదలుపెట్టి వరుసగా తొమ్మిది ప్రశ్నలు రాసుకొచ్చారు.

1) అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా?

2) ఒకవేళ జరిగుంటే, సీబీఎన్ గారికి తెలియకుండా జరిగిందా?

3) 300 కోట్లు పైగా ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా, ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా?

4) ఒక వేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ సీబీఎన్ గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే, దానిమీద ఇమ్మిడియట్ యాక్షన్ తీసుకోకపోవటం కరెక్టా?

5) ఎఫ్.ఐ.ఆర్. అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే… ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా?

6) చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైం చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ వుందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?

7) సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా?

8) లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్ గ్రండ్ బట్టి కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా?

9) నా తొమ్మిదవ చివరి ప్రశ్న… అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో, దానిలోని తప్పులెంటో ఒక వీడియో లో కెమెరా వంక చూస్తూ వివరించగలరా?

థాంక్యూ అండి” అని ముగించారు వర్మ! దీంతో వర్మ సీరియస్ నెస్ తో పాటు పవన్ పై ఉన్న వెటకారం కూడా ఒకేసారి చూపించగలిగారని అంటున్నారు నెటిజన్లు. కారణం… ఈ 9 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చినా… ఆ తర్వాత ఇక చంద్రబాబుకు అనుకూలంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై పవన్ కల్యాణ్ మాట్లాడలేని పరిస్థితి నెలకొంటుంది.

ఇదే సమయంలో ఒక వీడియో చేస్తూ కెమెరా వంక చూస్తూ వివరించగలరా అని అడగడంలో పరిపూర్ణమైన వెటకారం ధ్వనిస్తుందనే అనుకోవాలి. కారణం… పవన్ కల్యాణ్ చంద్రబాబు అరెస్టును ఖండించే విషయాన్ని కూడా పేపర్ చూసి చదివారనే విమర్శ ఉండటమే అని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా… ఈ 9 ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి!