కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా తన ప్రాభవాన్ని కోల్పోయి చాలా దయనీయమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నది. ఏప్రిల్ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవాన్ని రాహుల్ గాంధీ అసలు ఊహించలేదు. ఇంతకంటే చాలా మెరుగైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని గట్టిగా నమ్మారు. అది జరగక పోయేసరికి రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహిస్తూ అఖిల భారత కాంగ్రెసు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీని బ్రతికించు వలసిన బాధ్యత మాత్రం గాంధీ నెహ్రూ కుటుంబాల మీదనే ఉన్నది.
ఇటువంటి సమయంలో లో రాహుల్ గాంధీ ఏం చేస్తారు అని అందరు ఎదురు చూస్తున్నారు. రాజకీయం అంటే గత అనుభవాల నుండి నేర్చుకోవడం చేసిన తప్పు మళ్లీ చేయకపోవడం. ఆ సూత్రాన్ని పాటిస్తూ రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర చేయాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నడుస్తూ అనేకమందిని గ్రామస్థాయిలో కలుసుకొని వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు.
ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారంలోకి తీసుకువచ్చారు రాజశేఖర్ రెడ్డి. అయితే ఈ పరిణామాన్ని అప్పట్లో దేశ వ్యాప్తంగా చాలామంది చంద్రబాబు ఓడిపోవడమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే 1999 – 2004 మధ్య లో చంద్రబాబు ప్రభ అటు దేశంలోనూ ప్రపంచ స్థాయిలో వెలిగిపోతున్న వేళ. ప్రపంచ స్థాయి మేధావులు చంద్రబాబు పరిపాలన పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే ఇతర రాష్ట్రాలలో చంద్రబాబు పరిపాలన పై ఎంతో సామాన్య ప్రజానీకానికి ఎంతో క్రేజ్ ఉండేది. అలాగే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు ని ఆదర్శంగా తీసుకుంటున్నాము అని చేబుతుండేవారు.
చంద్ర బాబుని దీటుగా ఎదుర్కొన్న వై ఎస్ ఆర్
అటువంటి సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టగలదా అన్న అనుమానం అందరిలోనూ ఉండేది. అయితే రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా పదహారు వందల కిలోమీటర్లు నడిచి కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని తన మీద ఉన్న ఫ్యాక్షన్ ముద్ర చెరిపేసుకోవడమే కాకుండా తాను రాష్ట్ర స్థాయిలో అందరికి ఆమోదయోగ్యమైన నాయకుడినని, చంద్రబాబుకి నిజమైన ప్రత్యామ్నాయం అని నిరూపించగలిగారు.
అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు భారత దేశ వ్యాప్తంగా అవే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మోడీ ఖ్యాతి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అమోఘం అపూర్వం అన్నట్టు వుంది. మరి ఈ మోడీ శక్తిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే రాజశేఖర్ రెడ్డి ఆనాడు చేసిన పాదయాత్ర రీతిలో రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్త పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారట. ఎప్పుడు ఏంటి అనే విషయాల మీద ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ కనీసం చివరి మూడు సంవత్సరాలు రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నారట.
ఆలోచనైతే బాగానే చేశారు. మరి ఇది ఎంత మేరకు ఆచరణ సాధ్యం అవుతుందో చూడాలి. ఒక వేళ ఆచరణలో సాధ్యం అయినప్పటికీ ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతోయో లేదో వేచి చూడాలి. ఎన్నికల ఫలితాలు ఎలా వున్నా రాహుల్ గాంధీ అంత సుదీర్ఘ పాదయాత్రే చేస్తే మాత్రం ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా నిలబడటం ఖాయం.