చంద్రబాబునే అడిగారంటే.. పవన్ బాబుని అడగరా?

స్థానికంగా నివాసం ఉండటం అనేది ఏ నాయకుడికైనా ఒక ప్లస్ పాయింట్ అనడంలో సందేహం లేదు! గతం ఎన్నికల సమయంలో కూడా తాను తాడేపల్లి లోనే ఇళ్లు కట్టుకుంటున్నానని.. ఇక్కడే నివాసం ఉంటానని జగన్ చెప్పారు. తాను వేరే రాష్ట్రంలో తలదాచుకునే టైపు కాదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆ సమయంలో ఈ విషయం కూడా జగన్ కు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. అయితే.. ఇప్పుడు ఆ టాపిక్ బాబు వరకూ నేరుగా వచ్చేసింది!

అవును… హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేయడం కాదు. స్థానికంగా ఏపీలోనే నివాసం ఉండాలని, తద్వారా ప్రజలకు మరింత చేరువనే సందేశం ఇచ్చినట్లు అవుతుందని నేరుగా బాబుగారికి చెప్పేశారు తమ్ముళ్లు! కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన సమావేశంలో కార్యకర్తలు బాబుగారికి ఈ సూచనలు చేశారు.

కార్యకర్తలు కోరుకున్నారని కాదు కానీ… 40ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అనిచెప్పుకునే బాబు, ఈ మాత్రం చిన్న లాజిక్ మిస్ అవ్వడం నిజంగా దారుణమే అనే కామెంట్లు ఈసందర్భంగా కనిపించడం కొసమెరుపు!

ఇంత సీనియర్ అయిన చంద్రబాబునే కార్యకర్తలు నేరుగా అడిగేశారు అంటే… ఇక పవన్ బాబు పరిస్థితి ఏమిటనే ప్రాశ్నలు తదనుగుణంగా ఉత్పన్నమవుతున్నాయి. అవును.. ఏపీలో రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటున్న పవన్ కూడా తన నివాసాన్ని ఏపీకి మార్చడం ఎంతైనా అవసరమే! కాకపోతే అభిమానులు గట్టిగా అడగలేకపోతున్నారు.. అంతే!

కార్యకర్తలు అడిగారనో, ప్రజలు అడుగుతున్నారనో, నేతలు ఒత్తిడి తెస్తున్నారో కాదు కానీ… ఆ రాష్ట్రాన్ని పరిపాలించేయాలని అనుకుంటున్న నేతలు.. కనీసం స్థానికంగా స్థానికంగా నివాసం ఉండాలని ప్రజలు చెప్పాలా?

కాగా… ఓటుకి నోటు కేసు అనంతరం చంద్రబాబు తన మకాంని కరకట్టకు మార్చడం, పదవీ కాలం ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కి వెళ్లిపోవడం తెలిసిందే!