Purandeswari: గౌతమ్ అదానీ వ్యవహారం ప్రస్తుతం దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది అమెరికాలో ఈయనపై కేసు నమోదు కావడంతో ఇండియాతో పాటు ఈ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ కి కూడా లింక్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు రావడమే కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సైతం ఈ విషయంపై మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన ట్వీట్ చేశారు. పురందేశ్వరి ఈ విషయం గురించి స్పందిస్తూ అదానీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి కూడా భాగం ఉందని ఆయన కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంటూ ఈమె ట్వీట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
అదానీ గ్రూప్స్ పట్ల అమెరికా ఎస్‌ఈసీ చేసిన ఆరోపణలు ఎన్నో ప్రశ్నలను తలెత్తేలా చేస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఇతర అధికారులు లంచం తీసుకున్నట్టు ఎస్‌ఈసీ పేర్కొందని పురందేశ్వరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జూలై 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్యలో ఒడిశా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుదుర్చుకున్న ఒప్పందాల గురించి ఎస్ఈసీ ఆరోపణలు చేసిందని తెలిపారు.
ఇలా ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకుందని ఒకవైపు తెలుగుదేశం పార్టీ అలాగే బిజెపి కూడా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు అయితే ఈ కుంభకోణంలో మోదీ కీలక ప్రమేయం ఉందని మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నారు. మోడీ ఉన్నంతవరకు అదానీకు ఏం కాదంటూ మోడీ తనని రక్షిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఇటీవల మీడియా సమావేశంలో ఫైర్ అయిన విషయం తెలిసిందే.