నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు.. భారీ వేతనంతో జాబ్స్!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది తీపికబురు అనే చెప్పాలి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిబ్రవరి నెల 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 2024 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను నిర్వహించనున్నారని తెలుస్తోంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉంది.

ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్ స్క్రీనింగ్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2024 – 25 (స్పెషలిస్ట్ ఆఫీసర్) లింక్ పై క్లిక్ చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారంను ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.