పవన్ ది నీచ స్వభావం కాదంటున్న ఫృధ్వీ… కన్నాకు టెండర్?

పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన “బ్రో” సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. మిక్స్డ్ టాక్ తెచ్చుకుందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో… ఈ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్‌ ను అనుకరిస్తూ సీన్లు ఉండడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో ఫృధ్వీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

బ్రో సినిమాలో తన డాన్సులను ఇమిటేట్ చేశ్తూ చిత్రీకరించిన సన్నివేశాలపై కౌంటర్ అటాక్‌ కు దిగారు మంత్రి అంబటి రాంబాబు! “బ్రో సినిమా నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను.. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కల్యాణ్‌ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.. అలా ఆనందపడుతున్నాడు” అని అన్నారు.

అనంతరం తాను ప్యాకేజీలు తీసుకుని డ్యాన్సులు చేయనని.. ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో ప్రజలతో కలిసి తాను నాట్యం చేశానని తెలిపారు. “గెలిచినోడి డాన్స్ సంక్రాంతి!.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి!” అంటూ 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన విషయాన్ని పరోక్షంగా ప్రస్థావించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేసి ఆనందించడాన్ని శునకానందం అంటారంటూ అంబటి మండిపడ్డారు.

ఈ క్రమంలో సినిమాలో రాంబాబుని అనుకరించిన శ్యాంబాబు పాత్రదారి ప్రముఖ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ స్పందించారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ ను తిట్టాడా పొగిడాడా అనే సందేహం కలిగిందని పలువురు అభిప్రాయపడటం కొసమెరుపు.

అంబటిని అనుకరించాల్సిన అవసరం తనకు లేదని.. ఆయన ఏమన్నా ఆస్కార్ స్థాయి నటుడా అని ఫృధ్వీ ఎద్దేవా చేశారు. బ్రో సినిమాలో తనది బాధ్యతారహితమైన పాత్ర అని, పబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసే పాత్ర అని దర్శకుడు కోరిన మేర తాను ఆ పాత్ర చేశానని అన్నారు. ఇదే సమయంలో పవన్ క్యారెక్టర్ పై ఫృధ్వీ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు.

బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర అంబటి రాంబాబుకు సెటైర్ వేయడం కోసమే తీశారని చిత్ర యూనిట్ ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారని అంటున్నారు. అది జనసైనికులకు కూడా తెలుసు అని చెబుతున్నారు. అందుకే… ఆ సినిమాలో బైట్ ని జనసేన నాయకులు, కార్యకర్తలూ వైరల్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో పవన్ క్యారెక్టర్ పై ఫ్ర్ధ్వీ స్పందించారు.

పవన్ కల్యాణ్ ఎలాంటివారో మీకు తెలియదు అని మొదలుపెట్టిన పృథ్వి… పవన్ ది ఎవరినో కించపరుస్తూ సినిమాలో చూపించేంత నీచ స్వభావం కాదని అన్నారు. దీంతో… ఇది నిజంగా అంబటి కోసం కాకపోతే సరే. గుండెలపై ఒట్టేసుకుని పవన్ ఈ మాట చెప్పలేనిపక్షంలో… పవన్ ది నీచ స్వాభావం అని ఫిక్సయిపోవచ్చా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఆ సంగతి అలా ఉంటే… మరోవైపు అంబటి రాంబాబుపై తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. అవకాశం ఇస్తే సత్తెనపల్లిలో కచ్చితంగా చిత్తుగా ఓడిస్తానని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. దీంతో… అంబటిని చిత్తుగా ఓడించడం సంగతి కాసేపు పక్కనపెడితే… సత్తెనపల్లిలో చంద్రబాబు ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణకు టిక్కెట్ కన్ ఫాం చేశారని తెలుస్తోంది.

ఇదే సమయంలో టీడీపీ జనసేనల పొత్తు అల్ మోస్ట్ కన్ ఫాం అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో… తనకు ఎలాగూ సత్తెన పల్లి సీటు ఇవ్వరు కాబట్టి అంబటిని చిత్తు చిత్తుగా ఓడిస్తానని ఫృధ్వీ అంటున్నారా.. లేక, నిజంగానే కన్నాకు టెండర్ పెట్టే ఆలోచనలో ఉన్నారా అనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ టీడీపీ – జనసేన పొత్తు లేనిపక్షంలో… సత్తెనపల్లి టిక్కెట్టు ఫృధ్వీకి ఇవ్వాలని పవన్ ను రిక్వస్ట్ చేస్తున్నారు జనసైనికులు!