జగన్ పరువు తీస్తున్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓటెయ్యకపోతే పింఛన్లు ఆగిపోతాయంటూ?

YS Jagan

ఏపీలో 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ కష్టపడుతుంటే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ పరువు తీస్తున్నారు. ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ వైసీపీకి ఓటు వేయకపోతే పింఛన్ ఆగిపోతుందని తాజాగా ఒక మహిళతో చెప్పగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే కొంతమంది మాత్రం మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ ఆగిపోతుందని వైసీపీ ఎమ్మెల్యే చెప్పారని ఆ వీడియో గురించి తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఈ కామెంట్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదని అదే సమయంలో ఇతర పార్టీల పరువు పోయేలా వ్యవహరించడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జగన్ మాత్రం ఎమ్మెల్యేలకు తగిన సూచనలు చేయాల్సి ఉంది. పార్టీ పరువుకు భంగం కలిగే విధంగా ఏ ఎమ్మెల్యే అయినా వ్యవహరిస్తే ఆ ఎమ్మెల్యేపై జగన్ చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వైసీపీకి వ్యతిరేకంగా జరిగే ప్రచారం విషయంలో జగన్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లను వ్యతిరేకిస్తూ టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండ్తం గమనార్హం.

వైసీపీ ఎన్నో పథకాలను అమలు చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నేతలు తెలిసీతెలియక చేసే చిన్నచిన్న తప్పులు ప్రభుత్వం పరువు పోవడానికి కారణమవుతున్నాయి. సోషల్ మీడియా యుగంలో చిన్న తప్పు చేసినా ఆ తప్పు వల్ల పార్టీకి కలిగే నష్టం అంతాఇంతా కాదు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయాలను గుర్తుంచుకుంటే బెటర్ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.