వణికి పోతున్న చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ ట్వీట్

ఎన్నికల ప్రచారం నిపుణుడు ఇపుడు జెడి యు బీహార్ నాయకుడు ప్రశాంత్ కిశోర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఒక సలహా ఇచ్చారు. బీహార్ గురించి మాట్లాడటం మానేయని సలహా ఇచ్చారు. ఆంధ్రలో ప్రజలు తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలనే దాని మీద దృష్టి నిలపాలని ఆయన సలహా ఇచ్చారు.

 వైఎస్ వివేకానందరెడ్డి మరణానంతరం , ఎన్నికల ప్రచారం లో పాల్గొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిశోర్ మీద కూడా  విమర్శలు కుప్పించారు.ప్రశాంత్ కిశోర్ సలహా మేరకే  వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వోటర్ల తొలిగింపు కోసం ఎన్నికల కమిషన్ కు ఫామ్ -7 దరఖాస్తులను లక్షల సంఖ్యలోదాఖలు చేయించారని, వివేకానందరెడ్డి హత్యను  రాజకీయాలకు వాడుకోవాలనుకోవాలని జగన్ కు సలహా ఇచ్చింది కూడా ప్రశాంత్ కిశోర్ నే అని చంద్రబాబు విమర్శించారు.

దానిమీద ఇపుడు బీహార్ జనతా దళ్ యునైటెట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిశోర్ స్పందించారు. చురకలంటించారు.

 ‘ఓటమి తప్పదన్న వాస్తవం  ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా వణికిస్తున్నది. ఇలాంటపుడు చంద్రబాబు నా మీద నిరాధార ఆరోపణలుచేయడం గురించి నేను అర్థం చేసుకోగలను.

సర్జీ, బీహార్ మీద అసూయలతో కుళ్లుతో విషం చిమ్మేడం కన్నా ఆంధ్రలో ప్రజలు మీకేందుకో ఓటేయాలో అనే దాని మీద దృష్టినిలపండి,’ అని సలహా ఇచ్చారు.