ఆ మూడు జిల్లాలే జనసేనకు అనుకూలం.. పవన్ రూటు మార్చాల్సిందేనా?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జగన్ విషయంలో చేస్తున్న విమర్శలు రొటీన్ అయిపోయాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ విమర్శలు కొత్తగా లేవని ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని విమర్శల వల్ల ఉపయోగం ఏంటని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు జనసేనకు మూడు జిల్లాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.

విశాఖతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు మాత్రమే జనసేనకు అనుకూలంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ జనసేన చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించాలంటే రూటు మార్చాల్సిందేనని చాలామంది కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు చేసి టీడీపీకి అనుకూలంగా పవన్ ఉండటం వల్ల లాభం ఏంటని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తెలుగుదేశంకు జనసేన డైరెక్ట్ గా కానీ ఇన్ డైరెక్ట్ గా కానీ సపోర్ట్ ఇచ్చినన్ని రోజులు టీడీపీ వ్యతిరేకులు జనసేనను నమ్మే అవకాశం అయితే లేదు. మరోవైపు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వని పక్షంలో జనసేనకు నష్టం తప్ప లాభం ఉండదు. అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని జనసేన భావించినా ప్రజల మద్దతు లేకపోతే ఈ నిర్ణయం వల్ల లాభం ఏంటని ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగినా జగన్ నే పవన్ నిందించడం హాస్యాస్పదం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర వలసల గురించి, మత్స్యకారుల వలసల గురించి జగన్ నే పవన్ నిందించడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ప్రజలు వాస్తవ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తే అంతోఇంతో ప్రయోజనం చేకూరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.