వైయస్ జగన్ పై పోసాని సినిమా,టీడిపి టార్గెట్?

తాజాగా  నట,దర్శకుడు పోసాని  కృష్ణ మురళి …తన దర్శకత్వంలో ఓ సినిమా మొదలెట్టారు. దాంతో ఆ చిత్రం వైయస్ జగన్ కు ఫేవర్ గా ,తెలుగుదేశాన్ని విమర్శించే చిత్రం అంటూ ప్రచారం మొదలైంది. అలా పోసాని సినిమాని జగన్ కు ముడెట్టయ్యడానికి కారణం …ఒకటే…గత కొంతకాలంగా పోసాని..పని గట్టుకుని టీడీపిని టార్గెట్ చేస్తూ..వైయస్పార్పి పార్టి జెండాని భుజాన మోస్తూ…జగన్ ను పొగడ్తలతో ముంచెత్తటమే.

కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలపై సినిమా తీస్తానని చెప్పిన పోసాని ఆ సినిమాని మొదలెట్టేసినట్లు కనపడుతోంది. దానికి తోడు ఈ చిత్రంకి చెందిన టీమ్ తో ఆయన పులివెందులలో హంగామగా చేసారు. వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం ఆడిటోరియంలో సినిమా ప్రారంభం చేసారు.

వీరిని కలిసేందుకు చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రజలు తరలివచ్చారు. ఈ సినిమా పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో 20రోజులు చిత్రీకరించనున్నట్లు వారు తెలిపారు. ముందుగా పట్టణంలోని పలు లొకేషన్లను పోసాని పరిశీలించారు. ఆయనతోపాటు పలు వైసీపీ నేతలు కూడా ఉన్నారు.

దాంతో మీడియా వాళ్లు ఖచ్చితంగా ఇది జగన్ కు సపోర్ట్ చేసే సినిమానే అని ఫిక్స్ అయ్యిపోయారు. ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని ఏ విధంగా ఏపి రాజకీయాలను ప్రభావితం చేసే సినిమా చేస్తారో చూడాలంటున్నారు.

గోల్డెన్‌ఎర ప్రొడక్షన్‌ నెంబర్‌-1 నిర్మిస్తున్నఈ సినిమా నటీనటులు ఆలీ, జీవా, బాబుమోహన్‌, సినిమా డైరెక్టర్‌ పోసాని కృష్ణమురళి, నిర్మాత శ్రీధర్‌రెడ్డి పులివెందులలో ఉన్నారు.