బాలయ్యకు రాజకీయాలు మైనస్ అవుతున్నాయా.. విమర్శలు పట్టించుకోమంటూ?

స్టార్ హీరో బాలకృష్ణ అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే బాలయ్య రాజకీయాల కంటే సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. బాలయ్య నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తుండటంతో బాలయ్య సినిమాలకే ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాలకు సంబంధించి బాలయ్య ఎన్ని కామెంట్లు చేసినా అయనపై విమర్శలు చేసేవాళ్లు ఎవరూ ఉండరు.

అయితే రాజకీయాలకు సంబంధించి బాలయ్య విమర్శలు చేస్తే మాత్రం ప్రత్యర్థులు ధీటుగా బదులిస్తున్నారు. బాలయ్య 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశంకు కంచుకోట అనే సంగతి తెలిసిందే. అయితే హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య గెలిచినా హిందూపురం ఎంపీగా మాత్రం వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ గెలవడం గమనార్హం.

2019 హిందూపురం ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం వల్లే ఇలాంటి ఫలితాలు వెలువడ్డాయని చాలామంది భావిస్తున్నారు. తాజాగా బాలయ్య గోరంట్ల మాధవ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బాలయ్య గోరంట్ల మాధవ్ ను విమర్శించడంలో తప్పేం లేకపోయినా గతంలో బాలయ్య చేసిన కామెంట్ల సంగేతేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చెయ్యాలి అంటూ బాలయ్య ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి.

ఈ కామెంట్ల విషయంలో బాలయ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయనే సంగతి తెలిసిందే. బాలయ్య విమర్శలు చేయడంలో తప్పు లేదని కానీ బాలయ్య గతంలో చేసిన కామెంట్ల గురించి కూడా వివరణ ఇచ్చుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం అభివృద్ధి కోసం బాలయ్య పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు బెనిఫిట్ కలిగేలా చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.