ఆ పార్టీతో పొత్తు పెట్టుకో జగన్.. ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందిగా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పొత్తుల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళితే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.

ఏపీలో సొంతంగా గెలిచే సత్తా బీజేపీకి లేదనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ టీడీపీ, జనసేనలను నమ్ముకోవడం కంటే వైసీపీని నమ్ముకుంటే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీనే మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రాయలసీమ జిల్లాల ప్రజలు జగన్ కు అనుకూలంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలలో జగన్ పై వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకత జగన్ మళ్లీ అధికారంలోకి రాని స్థాయి వ్యతిరేకత అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఏపీలో అధికారంలో ఉండాలన్న బీజేపీ ఆకాంక్ష నెరవేరడంతో పాటు ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ మరింత ఎక్కువ మొత్తంలో నిధులను మంజూరు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు వల్ల వైసీపీపై విమర్శలు చేయాలంటే కూడా ఇతర పార్టీలు ఆలోచించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో మోదీ సర్కార్ నిర్ణయాలకు అనుకూలంగా జగన్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ అధికారికంగా మోదీ పార్టీతో చేయి కలిపితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.