మరో బ్రేకింగ్: కాంగ్రెస్ రాజనరసింహ అరెస్టు

సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న బంద్ లో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహను పోలీసులు అరెస్టు చేశారు. రాజనరసింహ సంగారెడ్డికి వెళ్తుండగా పటాన్ చెరువు వద్ద పోలీసులు రాజనరసింహను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు పై నిరసన తెలిపారు. మనుషుల

అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం సంగారెడ్డి బంద్ కు పిలుపినిచ్చింది. దామోదర రాజనరసింహ బంద్ లో పాల్గొంటే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

జగ్గారెడ్డిని అరెస్టు చేయడంతో నిరసన తెలపడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేత దామోదర రాజ నరసింహను అరెస్టు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలవరం రేగుతోంది. భవిష్యత్తులో ఇంకా ఎంత మంది నేతలను అరెస్టు చేస్తారోనని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. టిఆర్ ఎస్ కావాలనే నేతలపై కేసులు నమోదు చేసి రాజకీయంగా దెబ్బ తీయాలనుకుంటున్నారని నేతలు ఆరోపిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటి సీఎంగా శక్తి వంచన లేకుండా పనిచేసిన దామోదర రాజనరసింహకు తెలంగాణ అపద్దర్మ ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఇదేనా నరసింహ అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో నెట్టడం కోసమే నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారని వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.