బిగ్ బ్రేకింగ్… జనసేన పోటీచేసే 32 నియోజకవర్గాలివే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణలో అధికార బీఆరెస్స్ పార్టీ తమ అభ్యర్థులను చాలా రోజుల క్రితమే ప్రకటించేసింది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆల్ మొస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసిందని చెబుతున్నారు. మరోపక్క బీజేపీ కూడా ఆ ప్రయత్నాలలోనే ఉందని అంటున్నారు. ఈ సమయంలో జనసేన షాకిచ్చింది!

ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ జనసేన విభాగం.. ఆ పార్టీ పోటీచేయబోయే స్థానాలను ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ తెలంగాణ విభాగం ప్రకటించింది. ఏపీలో బీజేపీతో ప్రస్తుతానికి పొత్తులో ఉన్నామని చెబుతూ, టీడీపీతో కలిసి పోటీచేస్తామని చెబుతున్న ఏపీ జనసేన… తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే అని అంటుంది.

ఈ నేపథ్యంలో 32 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు ప్రకటించింది. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఏమైనా ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని ఈ సందర్భంగా ఆ పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా… గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో అనేక సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేసిందని మహేందర్ రెడ్డి వెల్లడించారు.

ఈ క్రమంలో… తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యం అని, తెలంగాణ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 32 స్థానాలకు సిద్ధమైన జనసేన పార్టీ అంటూ ఆ నియోజకవర్గాల పేర్లను వెల్లడించింది.

ఆ నియోజకవర్గాల పేర్లు ఈ విధంగా ఉన్నాయి…!

కూకట్ పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, ఉప్పల్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కొత్తగూడెం, పాలేరు, ఇల్లందు, మధిర, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, మంథని, హుజూర్ నగర్, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది.