పోలవరం జిల్లా.! టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త రాజకీయం.!

Chandrababu

తాము అధికారంలోకి వస్తే, పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఇంతకన్నా కామెడీ ఇంకేమన్నా వుంటుందా.? అధికారంలో వున్న ఐదేళ్ళలో ఏనాడైనా కొత్త జిల్లాల ఏర్పాటు గురించి చంద్రబాబు ఆలోచించారా.? పోలవరం ముంపు ప్రాంతాల గురించి పట్టించుకున్నారా.?

గోదావరి వరదల నేపథ్యంలో, ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు బురద రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పోలవరం జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. ముంపు ప్రాంతాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే, జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారట.?
ముంపు మండలాలది ఓ వ్యధ.!

భద్రాచలం పక్కనే వున్న ఎటపాక, కూనవరం నుంచి పోలవరం ప్రాజెక్టుకి ఆనుకుని వున్న ప్రాంతాల మధ్య చాలా దూరం వుంటుంది. సరైన రవాణా మార్గాలు లేని గ్రామాలు బోల్డన్ని కనిపిస్తాయి. పైగా, అదంతా గిరిజన ప్రాంతమే. ఎక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినా, చాలా గ్రామాలకు కనెక్టివిటీ సమస్య వుంటుంది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుకి ఇవన్నీ తెలియవని ఎలా అనుకోగలం.? అన్నట్టు, వైసీపీ చేతిలోనే అధికారం వుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, పోలవరం జిల్లాని ప్రకటించేస్తే.? ఏమో, అది జరిగినా జరగొచ్చుగాక.! జిల్లాతో సమస్యలు తీరవ్.. ముంపు బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.. వారిని ఆదుకోవాలి.