40 మంది ఎంఎల్ఏలు టచ్ లో ఉన్నారు…మోడినే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారా ?

million dislikes for man ki beat modi twitter account hacked

అంటే ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది ప్రధాని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని. ఇక రెండో అంశం 40 ఎంఎల్ఏలు తనతో టచ్ లో ఉన్నారంటే మోడి అంత ఖాళీగా కూర్చున్నారా అని. ఫిరాయింపులకు రెడీగా ఉన్న ఎంఎల్ఏల్లో ప్రతీ ఒక్కళ్ళూ తమకు కావాల్సిన ప్యాకేజీల డిమాండ్లను పెడతారు. ఆ ప్యాకేజీలన్నింటిని విన బేరసారాలు కుదుర్చుకునేంత తీరిక మోడికి ఎక్కడిది ?

40 మంది ఎంఎల్ఏలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని మోడి చెబితే అది ఓ లెక్కగా ఉండేది. కానీ తనతోనే ఎంఎల్ఏలంతా టచ్ లో ఉన్నట్లు చెప్పటమే ఇబ్బందిగా ఉంది. స్వయంగా ప్రధానమంత్రే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే ఇక రాష్ట్రాల స్ధాయిల్లో ముఖ్యమంత్రులను అనుకునేదేముంది ?

మోడి వైఖరిని బాగా గమనించిన వాళ్ళు కాబట్టే కెసియార్, చంద్రబాబునాయుడు తమిష్టం వచ్చినట్లుగా ఫిరాయింపులకు పాల్పడ్డారు. మోడి అయినా కెసియార్, చంద్రబాబు అయినా చెప్పేదొకటే ప్రతిపక్షాలుండకూడదని. నిజంగా మోడి చేసిన ప్రకటన చవకబారుగా ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వలను కూలగొట్టేందుకు మోడి కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న విషయం అర్ధమైపోతోంది.

మమత బెనర్జీ మీద కోపముంటే పశ్చిమబెంగాల్లో బిజెపిని బలోపేతం చేసుకోవాలి, జనాధరణ పెంచుకుని అధికారంలోకి రావాలి. అంతేకానీ ఎన్నికైన టిఎంసిని మధ్యలోనే కూలదోసి బిజెపిని అధికారంలోకి తేవాలనుకోవటం ఎంతమాత్రం మంచిది కాదు. మోడి అలాంటి విధానాలకు పాల్పడితే ఇక కాంగ్రెస్ కు బిజెపికి తేడా ఏముంటుంది ?