కోడికత్తి వర్సెస్ నిమ్మకాయల కత్తి!

గతకొన్ని రోజులుగా జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాస్… ప్రెస్ మీట్ పెట్టి విషయాలు వెళ్లడించినట్లు కొన్ని మీడియా సంస్థలు రాసుకొస్తున్నాయి! ఇక ఈ కేసులో కుట్రకోణం లేదు అని ఎన్.ఐ.ఏ. నివేదిక ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో… జగన్ కు సానుభూతి కలిగించాలనే పొడిచానని శ్రీను చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ విషయాలపై తాజాగా తనదైన శైలిలో స్పందించారు పేర్ని నాని.

జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నం జరిగితే.. దాన్ని “కోడికత్తి కేసు” అంటూ వెటకారం చేయడం దారుణం అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. “ఈనాడు” లాంటి పత్రిక కూడా “కోడికత్తి కేసు” అంటూ రాయడం సరికాదని హితవు పలికారు. గతంలో ఎన్టీఆర్ పై నిమ్మకాయల కత్తితో దాడి జరిగితే ఆయన బొటనవేలుకి గాయమైతే.. “హత్యాయత్నం” అంటూ బ్యానర్ పెట్టారని.. జగన్ విషయంలో అంత వివక్ష దేనికని ప్రశ్నించారు.

ఇక.. ఎన్టీఆర్ పై దాడి చేసిన మల్లెల బాబ్జిని ఆ తర్వాత ఎవరు చంపించారో అందరికీ తెలుసన్న నాని… కోడికత్తి శ్రీను ఇంకా బతికే ఉన్నాడని, తాము అలాంటి దుర్మార్గులం కాదని స్పష్టం చేశారు. జగన్ కి లాభం చేకూర్చేందుకే ఆ దాడి చేశానంటూ నిందితుడు స్టేట్ మెంట్ ఇచ్చినట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలిచ్చారని.. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిందితుడి గదిలోకి ఎలా వెళ్లి ఈ సమాచారం సేకరించారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా… మరింత సీరియస్ అయిన నాని… కొన్ని పచ్చ కుక్కలు అమాయకమైన కుక్కల్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు!

ఈ సందర్భంగా బాబుపై స్పందించిన నాని… చంద్రబాబు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మేనేజ్ చేస్తున్నారని.. సీబీఐ, ఎన్నైఏ లో కూడా.. ఆయనకు స్లీపర్ సెల్స్ ఉన్నారని చెబుతున్నారు నాని. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇంతలా మేనేజ్ చేయబడతాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలిపిరి ఘటన కూడా డ్రామానా చంద్రబాబూ? అని ప్రశ్నించిన నాని… అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు వైఎస్సార్ ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. పటిష్ట భద్రత ఉన్న ఎయిర్‌ పోర్టు లోపలికి ఒక మారణాయుదం ఎలా వచ్చింది? హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారు? అనే విషయాలపై విచారణ జరగాలని జగన్ అప్పట్లో పిటిషన్ వేశారని, ఘటనపై విచారణ జరపాలని కోరడం తప్పా? అని సూటిగా ప్రశ్నించారు.

ఇదే అంశంపై మంత్రి బొత్సా సత్యన్నారాయణ స్పందించారు… ఎన్.ఐ.ఏ. నివేదిక ఎలా బయటకు వచ్చింది? అది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పట్టుకుని ఎలా రాస్తోంది? అని ప్రశ్నించారు. కోడికత్తి కేసులో జగనే తన మీద దాడి జరిపించుకున్నట్లుగా మీడియాలో రాతలు రావడం పూర్తిగా తప్పుడు ప్రచారం అని దుబ్బయట్టారు.

Perni Nani Gives Clarity on Kodi Katthi Issue | YCP Vs TDP | CM YS Jagan | AP News | Mango News