శ్మశానాన్ని కూడా వదలని వైసీపీ నేతలు.. ఏపీ పరువు పోతుందిగా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నారు. అయితే కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖాళీ స్థలం దొరికితే ఆక్రమించాలని కొంతమంది వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో చోటు చేసుకున్న ఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.

వైసీపీ నేత చాన్ భాషా పాతసింగరాయకొండలోని గిరిజన కుటుంబాలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని కొట్టేయాలని నకిలీ పట్టా సృష్టించడంతో పాటు అక్కడి భూమిని చదును చేసి పంట వేయించాడు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా చాన్ భాషాను అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తహశీల్దార్ ఉష సైతం ఆ భూమి ప్రభుత్వ భూమి అని వెల్లడించారు.

ఆ భూమికి సంబంధించి ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ నేత చాన్ భాషా నకిలీ పత్రాలతో ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని తహశీల్దార్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న నేతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రభుత్వానికే భారీ నష్టం అనే సంగతి తెలిసిందే.

ఇలాంటి నేతల గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. వైసీపీ నేతలు చివరకు శ్మశానాలను కూడా వదలడం లేదా? అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ నేతల వ్యవహార శైలిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.