వైసిపి ‘ఇసుక దొంగ’ అనడంతో ఉళిక్కి పడిన ఎమ్మెల్యే…(వీడియో)

తెలుగు రాష్ట్రాలలో ఇసుక బంగారమయింది. ఇసుక అమ్ముకుంటే చాలా కోట్లే. ఇసుక ఇపుడు ఇతర రాష్ట్రాలకే కాదు, విదేశాలకు కూడా ఎగమతి అవుతూ ఉంది. అందుకే పవర్ లో ఉన్న వాళ్లంతా ఫస్టు ఇసుక ఎక్కడుంది అని వెదుక్కోవడమే. దానికితోడు ఇసుక ఇపుడుఉచితం. ఉచితం అంటే ఎవరికీ, పలుకుబడి ఉన్నోళ్లకు,పవర్ లో ఉన్నోళ్లకే. అందుకే ప్రజా ప్రతినిధుల మీద వచ్చే మొదటి ఆరోపణ ఇసుక దొంగతనం. ముఖ్యమంత్రి కొడుకుల మీద కూడా ఇసుక దొంతతనం ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యం వైసిపి అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే బికె పార్థసారధి మీద ఇసుక దొంగతనం అరోపణ చేశారు.రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, అల్లుడు ఇద్దరు కలసి ఇసుకను కర్నాటకకు తరలిస్తున్నారని ఆరోపించారు. దానికి ఈ రోజు పార్థసారధి ఇచ్చిన సమాధానం…

పెనుకొండ వైసిపి నేత శంకర్నారాయణ చేసిన ఇసుక దొంగతానికి పార్థసారథి రీ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే… 

‘‘ఇసుకను నేను నా అల్లుడు అక్రమంగ తరలించి అమ్ముకుంటున్నాం అన్నావు. సాక్షాధాలరతో నిరూపించు.నీ సభ కేవలం 1000 నుండి 1500 వందల ప్రజలూ మాత్రమే వచ్చారు. అది గ్రహించు.నీ పాద యాత్రలో కొన్ని గ్రామాల్లో నీకు ఆదరణే లభించలేదు అదీ గమనించు.నేను రొద్దంలో నీవు పెట్టిన సభా ప్రాంతంలోనే నా సభ పడుతా.  ఆ సభకు కేవలం రొద్దం గ్రామం నుండే 10 వేల మంది వస్తారు, చూస్తావా ? నీ సభకు ధర్మవరం నుండి ఇతర ప్రాంతాల నుండి సామాన్య ప్రజలను తీసుకువచ్చావు..నేను అలా రాను..ఇపుడు నీ ఛాలెంజ్ కు నేను సిధ్ధం మీడియా సాక్షిగ తేల్చుకుందాం వస్తావా ?? సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళను నీ పార్టీలోకి చేర్చుకున్నంత మాత్రానా బీసిలు నీ వెంట ఉన్నట్లు నీ పార్టికి ఓట్లు వేసినట్లు కాదు.అన్ని కులాలకు నిలయం మా తేదేపా,’ అని పెనుకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మాట్లాడుతూ  ఎమ్మెల్యే బీకే పార్థసారథి చెప్పారు.

 

ఇది కూడా చదవండి

 

టిడిపి ఎమ్మెల్యే ఇసుక దొంగతనం మీద చర్చకు రెడీ: వైసిపి