దెబ్బకు దెబ్బ తీసేంత సీన్ ఉందా ? అన్నదే అందరి సందేహం. మూడు రోజులుగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్న పవన్ మాట్లాడుతూ తన వెంటే పదవులు పడేట్లు చేస్తానంటున్నారు. ఇతరుల్లాగ తాను పదవుల వెంట పడరట. తనను ఓడించేందుకు భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలోనే రూ 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు పవన్ చెబుతున్నారు. అయితే ఆ ఖర్చు ఎవరు పెట్టారో మాత్రం చెప్పలేదు.
మొత్తానికి పోటి చేసిన 140 నియోజకవర్గాల్లో 120 చోట్ల డిపాజిట్లు రాకపోయినా పవన్ మాత్రం చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. జనసేనకు పడిన ప్రతీ ఓటు 100 ఓట్లతో సమానమట. ఇంకానయం పవన్ కు భీమవరంలో 60 వేల ఓట్లు వచ్చాయి కాబట్టి వాటిని 100 తో గుణించి తాను గెలిచినట్లు చెప్పుకోలేదు అంత వరకూ సంతోషం.
మొన్నటి ఎన్నికల్లో సీట్లు గెలుచుకోకపోయినా స్వచ్చమైన మనసులను గెలుచుకున్నామని కథలు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా ఓడిపోయిన దగ్గర నుండి అచ్చం ఇలాగ మాట్లాడారు. అయితే ఇపుడిపుడే వాస్తవంలోకి వచ్చి జనాలు ఎందుకు ఓట్లు వేయలేదనే విషయాలను చర్చిస్తున్నారు. బహుశా పవన్ కూడా ఇలాగే కొద్ది రోజులు హడావుడి చేసి తర్వాత వాస్తవంలోకి దిగుతారేమో తెలీదు.
అంతా అయిన తర్వాత చివరలో మాట్లాడుతూ ఇప్పటి వరకూ అందరూ తన ఆశయాలనే చూశారని ఇక నుండి దెబ్బకు దెబ్బ తీస్తానంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు. దెబ్బకు దెబ్బ ఎవరిని తీస్తారో మాత్రం చెప్పలేదు. ఎన్నికలన్నాక ప్రత్యర్ధుల ఓటమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పావులు కదపటం సహజం. అంతమాత్రాన ఓడిపోయిన వారందరూ దెబ్బకుదెబ్బ తీస్తా అని అనటం ఏమి ప్రజాస్వామ్యమో పవన్ కే తెలియాలి. సమస్యల పరిష్కారినికి జనసేన ఉందనే నమ్మకం జనాల్లో కలగాలట. ముందు పవన్ యాక్టివ్ గా ఉన్నారని జనసేన నేతలకు కలిగితి అదు పదివేలు.