“రామతీర్థంలో రాముని విగ్రహాన్ని నరికేశారు. అంతర్వేదిలో రథం తగులబడింది. అయినా ఇప్పటివరకు నేరస్థులను పట్టుకోలేదు. హిందూ ధర్మమంటే చులకనగా ఉందా? ఇస్లామ్, క్రిస్టియన్ మతాల విషయంలోఈ ఇలాగే చేస్తున్నావా?” ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా హిందూధర్మం అంశంపై చేసిన ప్రసంగంలోని నాలుగు వ్యాఖ్యలు!
అవును… తనకు కులం లేదంటూ నోరు విప్పితే కులాల ప్రస్థావన, తనకు మతం లేదంటూనే హిందూ మతం విషయంలో జగన్ వివక్ష చూపిస్తున్నారన్నట్లుగా రెచ్చగొట్టేలా సాగుతున్న ప్రసంగాలు! దీంతో… చెప్పే మాటలకూ చేసే పనులకూ పొంతన లేకపోతే రాజకీయంగా ప్రజల చీత్కారాలు ఎదుర్కోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు.
ఇదే సమయమంలో… టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఘోరాల లెక్కలు తీస్తున్నారు వైసీపీ నేతలు. ఆలయాల ఘటనలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ (జనవరి 13, 2021) చేసిన ప్రకటన ఆధారంగా.. జరిగిన ఘటనల వివరాలు పొందుపరిచారు. ఇందులో భాగంగా… చంద్రబాబు హయాంలో 2015లో 163, 2016లో 207, 2017లో 139, 2018లో 123, 2019లో 177 ఘటనలు జరిగాయని డీటైల్స్ అన్నీ భయటపెట్టారు.
అదేవిధంగా… జగన్ సీఎం అయిన అనంతరం 2020లో 143 సంఘటనలు జరగా.. 2021లో కేవలం ఆరు సంఘట్నాలు మాత్రమే జరిగిన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు హయాంలో 400 ఆలయాలను కూల్చి వేస్తే పవన్ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు పవన్ నుంచి సమాధానం వచ్చే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేస్తున్నారు.
ఈ సందర్భంగా… రాష్ట్రంలో దేవాలయాలు కూల్చేసింది నీ దత్తతండ్రి చంద్రబాబే అని పవన్ కి చెబుతున్న ఏపీ మంత్రులు… గతంలో దేవాలయాలు కూల్చివేసినప్పుడు కళ్ళు మూసుకున్నావా పవన్? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసని నిలదీస్తున్నారు.
అలాగే… హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్ కు లేదని చెబుతున్న మంత్రులు… వివాహ వ్యవస్థపై గౌరవం లేని పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. ఇదే సమయంలోఫ్ వేషాలు వేసి మోసాలు చేసి, హిందూ ధర్మం పాటించలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ రాజకీయ విమర్శల సంగతి అలా ఉంటే… తాను కొత్త తరహా రాజకీయాలు తీసుకువస్తానని పార్టీ స్థాపించిన కొత్తలో చెప్పుకొచ్చిన పవన్… రానురానూ చెత్త రాజకీయాలు తెరపైకి తెస్తున్నారని అంటున్నారంట నెటిజన్లు. చెప్పేవి శ్రీరంగ నీతులు… చేసేవి ఇలాంటి వేషాలా అంటూ ఫైరవుతున్నారంట. ఈ సందర్భంగా…. పవన్ మూవీ “జానీ” లోని ఒక పాటను ప్రముఖంగా పోస్ట్ చేస్తూ… ఆ పోస్ట్ కింద పవన్ హిందూధర్మం, కులాల ప్రసథావనకు సంబంధించిన వీడియోలు యాడ్ చేస్తున్నారని అంటున్నారు.
“మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు
మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు
మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు
మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు
దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు
దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు
అధికారం తన పదవి కొరకు నాయకుడు
మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని!