పవన్ పల్లకి ట్వీట్… గ్యాప్ లో వేసేసిన అంబటి!

ఒకపక్క మహానాడులో టీడీపీ నేతల విమర్శలు.. మరోవైపు వారికి కౌంటర్ గా వైసీపీ నేతల వీర ఉతుకుడుతో ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈ సమయంలో తనను లైట్ తీసుకోవద్దంటూ పవన్ కల్యాణ్ ఆన్ లైన్ వేదికగా ఒక కార్టూన్ ని వదిలారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఇది వైరల్ గా మారగా… అప్పుడే అంబటి రాంబాబ్లు లాంటోళ్లు గ్యాప్ లో పవన్ కు దిమ్మతిరిగే కౌంటర్స్ వేస్తున్నారు.

ఇప్పటికే “కథాకళి” పేరుతో నాగబాబుతో ఓ సెటైరికల్ వీడియో చేయించి ట్విట్టర్లో పోస్ట్ చేయించిన పవన్… వెంటనే జగన్ పై ఓ కార్టూన్ ని కూడా పోస్ట్ చేశారు. ఆ కార్టూన్ లో జగన్ పల్లకిని వైసీపీ నాయకులు మోస్తున్నట్టుగా ఉంది. జగన్ అనుచరులంతా.. “కొత్తా దేవుడండీ”.. అనే పాట పాడుతున్నట్టు కార్టూన్ వేశారు. “నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైనది” అని పవన్ కల్యాణ్ అన్నట్టుగా కార్టూన్ పైన హెడ్డింగ్ పెట్టారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న సమయంలో అడ్డుతగులుతున్న ప్రతిపక్షాలకు కౌంటర్ గా “పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం..” అంటూ వైసీపీ ఒక పోస్టర్ వదిలింది. దానికి కౌంటర్ గా ఇప్పుడు “నియంతలతో యుద్ధం” అంటూ కార్టూన్ వేయించారు పవన్. అయితే ఇప్పటికే “పాపం పసివాడు” అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందె!

అయితే తాజాగా పవన్ వేసిన కార్టూన్ పై తనదైన శైలిలో స్పందించారు మంత్రి అంబటి రాంబాబు! “మా నాయకుడినే మోస్తాం, ప్యాకేజి కోసం పక్క నాయకుడిని కాదు” అంటూ ట్విట్టర్లో అంబటి రిప్లై ఇచ్చారు. అంటే… మరోసారి తెరపైకి ప్యాకేజీ విషయాన్ని తీసుకొచ్చారు. దీంతో… ట్విట్టర్ లో అంబటి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. జనసైనికులను ఆలోచనలో పాడేస్తున్నాయని తెలుస్తుంది!