ఏపీలో అధికారంలోకి రావాలంటే మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం మినహా బీజేపీకి మరో ఆప్షన్ లేదు. తెలంగాణ బీజేపీలో బలమైన నాయకులు ఉండటం ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. ఏపీలో కూడా బీజేపీకి ఎక్కువ సంఖ్యలో నేతలు ఉన్నా వాళ్లలో చాలామంది నేతలు పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఆశాకిరణంలా కనిపించారు.
అయితే పవన్ కోరిన రోడ్ మ్యాప్ ను బీజేపీ ఇవ్వకపోవడంతో పవన్ చంద్రబాబు వైపు దృష్టి పెట్టారు. పవన్ కోరినన్ని సీట్లు ఇవ్వలేనని చంద్రబాబు ఇప్పటికే తేల్చి చెప్పారని సమాచారం అందుతోంది. సీట్లు తగ్గినా పరవాలేదని పవన్ భావిస్తే చంద్రబాబు పవన్ పార్టీల పొత్తుకు సంబంధించిన అధికారిక ప్రకటనకు ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు. అయితే ఇదే సమయంలో టీడీపీ జనసేనలకు బీజేపీ మద్దతు ఉంటే బాగుంటుందని పవన్ భావిస్తున్నారు.
కేంద్రంలో 2024 ఎన్నికల్లో బీజేపీ మినహా మరో పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. బీజేపీ మద్దతు ఉంటే టీడీపీ జనసేన కూటమికి ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో అధికారంలో ఉండాలని భావిస్తే పొత్తు పెట్టుకోవడం మినహా బీజేపీకి మరో ఆప్షన్ అయితే లేదని చెప్పవచ్చు. అయితే గత పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఇందుకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తోంది.
మోదీ ఓకే చెబితే మాత్రం ఏపీలో మూడు పార్టీల పొత్తు దిశగా అడుగులు పడతాయి. అదే సమయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులకు కచ్చితంగా భారీ షాక్ తగిలే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 2024 ఏపీ ఎన్నికల్లో చక్రం తిప్పే పార్టీ ఏదనే చర్చ అభిమానుల మధ్య జోరుగా జరుగుతోంది.