జ‌గ‌న్‌పై దాడి ఘటనలో మరోసారి స్పందించిన జనసేనాని పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రైలు యాత్ర చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా జగన్ పై దాడి ఘటన పై స్పందించిన పవన్ కళ్యాణ్…వైసీపీ అధినేత జగన్ కి మద్దతుగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో భిన్న చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎం మాట్లాడారో కింద చదవండి.

పవన్ మాట్లాడుతూ…

ప్రతిపక్ష నేతపై దాడి జరగడం దురదృష్టకరం అన్నారు. దీనిపై టిడిపి నేతలు వెకిలిగా మాట్లాడటం సరికాదు అని హితవు సూచించారు. దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలి అని అన్నారు.

తల్లి, చెల్లి దాడి చేయించారని అనడం తప్పు. ఎక్కడైనా తల్లే కొడుకుపై దాడి చేయిస్తుందా…? అని ప్రశ్నించారు.

విజయమ్మ,షర్మిల నన్ను ఎన్నో తిట్టినా…నేను వాళ్ళని ఏమి అనలేదు కదా! అని గుర్తు చేశారు.

దాడి కావాలని చేశాడా..? ఎవరైనా చేయించారా..? కుట్ర ఉన్నదా? అనేది పోలీసుల విచారణలో తేల్చాలి అని అన్నారు.

రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలి అని హెచ్చరించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉంది. నా పర్యటనలో కూడా పోలీసులు రక్షన కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

చింతమనేని తీరు ఇంకా మారలేదు…మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దీన్ని ఖండిస్తున్నా అన్నారు.

పవన్ కళ్యాణ్ ను రైలులో శ్రీకాకుళం వలస కార్మికులు, రాజమండ్రిలో టెక్స్ టైల్స్ పరిశ్రమల్లో పనిచేస్తున్న వలస కూలీలు కలిశారు.

సొంత ఊరిలో ఉపాధి లేక ఎక్కడెక్కడికో వలస పోతున్నామని పవన్ వద్ద కార్మికుల ఆవేదన తెలిపారు.

మీలాగా కండరాల శక్తిని నమ్ముకొని పనిచేసే వారికి రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లకు తగ్గించి మీకు పింఛను వచ్చే ఏర్పాటు చేస్తాము అని శ్రీకాకుళం వలసదారులకు పవన్ హామీ ఇచ్చారు.