చంద్రబాబుకు పవన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ?

చంద్రబాబునాయుడుకు జననసేన అధినేత పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పుకోవాలట. ఎందుకంటే,  షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో జనసేనలోకి ఇతర పార్టీల నుండి కొందరు పేరున్న నేతలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అవకాశాలు కల్పించినందుకే పవన్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి.

 

కాంగ్రెస్, టిడిపిలు పొత్తులు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పొత్తులను నిరసిస్తూ కొందరు సినియర్ నేతలు కాంగ్రెస్ కు రాజీనామాలు చేస్తున్నారు, మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, సి. రామచంద్రయ్యలు పార్టీకి రాజీనామా చేసేశారు. వీరి దారిలోనే మరికొందరు కూడా నడిచే అవకాశాలున్నాయన్నది సమాచారం.

 

 నిజనికి  మొన్నటి వరకూ జనసేనలో పవన్ తప్ప పేరున్న రెండో నేత లేరనే చెప్పాలి. ఈమధ్యనే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలకు గాలమేసేందుకు మనోహర్ ను పార్టీలోకి తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇపుడా అవసరం వచ్చేట్లు లేదు. ఎందుకంటే, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్లలో మెజారిటీ నేతల చూపు  జనసేనవైపు ఉందని సమాచారం. త్వరలో వట్టి, సిఆర్ జనసేనలో చేరబోతున్నారట. పొత్తుల విషయంలో కాంగ్రెస్ లో నిరసనలు బయటపడింది. అయితే అంతే అసంతృప్తి  టిడిపిలో కూడా ఉంది.  కానీ ఇప్పటికిప్పుడు బయటపడే అవకాశం లేదు.

 

టిడిపిలోని అసంతృప్తులు బయటపడటానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. బహుశా ఎన్నికలు దగ్గర ముందు బయటపడతాయేమో చూడాలి. ఎందుకంటే, నేతలకు ఒకపుడు పార్టీల చాయిస్ తక్కువ. కానీ ఇపుడలా కాదు. టిడిపి కాదంటే వైసిపి ఉంది.  లేకపోతే జనసేన అదీకాక పోతే బిజెపి రెడీగా ఉంటాయి. జనసేన, బిజెపిల్లో అభ్యర్దులకు కొరతుందన్నది అందరికీ తెలిసిందే.  

 

ఇప్పటికిప్పుడు 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్దానాలకు అభ్యర్ధులను చెప్పమంటే బిజెపి, జనసేనలు చెప్పే పరిస్ధితిలో లేవు. గట్టి అభ్యర్ధుల కొరత బాగా ఎక్కువుంది. అందుకనే ఇటు కాంగ్రెస్, అటు టిడిపిల నుండి వచ్చే నేతల్లో అత్యధికులు టిక్కెట్లు కేటాయిస్తాయనటంలో సందేహం లేదు. అంటే చంద్రబాబుకే పదన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి.