రిస్క్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారా.. గెలుపు కోసం మరో మార్గం లేదా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలో ఉండకూడదని భావిస్తున్నారు. వైసీపీ కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉండే సత్తా ఉన్న పార్టీ కేవలం టీడీపీ మాత్రమేననే సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనసేన బీజేపీ పొత్తులో ఉండగా ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. మోదీ అనుమతితో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు దిశగా పవన్ అడుగులు వేసినా ఫలితం లేకుండా పోయింది.

ప్రస్తుతం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం రెండు పార్టీలకు ప్రయోజనం కలుగుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రిస్క్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. గెలుపు కోసం పొత్తు పెట్టుకోవడం మినహా మరో మార్గం లేదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా టీడీపీతో కలిసి ముందుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల బీజేపీకి జనసేన తాత్కాలికంగా దూరమైనా ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే మోదీ ఆశీస్సులు పొందడం కష్టం కాదని పవన్ భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా జనసేన పోటీ చేసినా పెద్దగా ఫలితాల్లో మార్పు ఉండదని సర్వేల ఫలితాల ద్వారా పవన్ కు ఇప్పటికే అర్థమైంది. త్వరలో పొత్తులకు సంబంధించి పవన్ సంచలన ప్రకటన చేయనున్నారు.

ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ వ్యూహాలకు చెక్ పెట్టాలంటే పవన్ కళ్యాణ్ ముందు మరో మంచి ఆప్షన్ లేదు. మరోవైపు తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుంది. బీజేపీతో సంబంధం లేకుండానే ఈ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనున్నట్టు సమాచారం అందుతోంది.