బీజేపీకి వణుకు పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్.. తల వంచక తప్పదా?

winning-signs-in-11-lok-sabha-constituencies-mount-for-pawan-kalyans-janasena

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పాపులారిటీ ఉన్న నేతలు చేరడం వల్ల తెలంగాణలో బీజేపీ బలపడిందనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బీజేపీ బలపడకపోవడంతో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ పై ఆధారపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ ముంచుతాడో తేల్చుతాడో అని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ బీజేపీకి వణుకు పుట్టిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే వ్యక్తి అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. వైసీపీ మంత్రులు మాత్రం ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగనే సీఎం అవుతారని భావనను కలిగి ఉన్నారు. జగన్ పాలనపై ప్రజల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

జగన్ పాలనను కొంతమంది సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే తప్పులను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం జగన్ పై ఉంది. పవన్ మాత్రం జగన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకతను కలిగి ఉన్నారు. జగన్ కు చిరంజీవి అనుకూలంగా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఆయనను ద్వేషిస్తున్నారు. జనసేన సొంతంగా మాత్రం ప్రభావం చూపలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రజారాజ్యం స్థాయిలో జనసేన సక్సెస్ కావడం తేలిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి సపోర్ట్ చేస్తే మాత్రం జనసేన మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన 2024 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.