సమాధానం లేని ప్రశ్నకు పవన్ బొమ్మరిల్లే సమాధానం?

అంతా మీరే చేశారు నాన్నా… అంటూ బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్ధర్థ్, ప్రకాశ్ రాజ్ ని ఉద్దేశించి అంటాడు. మధ్యలో తల్లిపాత్రలో ఉన్న జయసుధ వచ్చి.. ప్రకాశ్ రాజ్ తో “కొట్టేస్తా మిమ్మల్ని” అంటుంది! తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఇచ్చిన ఒక వివరణ ఆ సీన్ ని గుర్తుకు తెచ్చేలా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

అవును… వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఎందుకు అనాల్సివచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. “నేను వైకాపా ఓటు చీలనివ్వనన్నానంటే దానికి కారణాలున్నాయి. భాజాపాతో పొత్తు పెట్టుకుని మేము అనుకున్న ప్లాన్ అమలు చేసివున్నట్లయితే, తెలుగు దేశం పార్టీ అవసరం లేకుండా ఎదిగేవాళ్లం” అన్నారు పవన్ కల్యాణ్. అంటే ఇప్పుడు తమ ఎదుగుదలకు టీడీపీ అవసరమని చెబుతుతున్నారో ఏమో!

ఇక మరో కారణం చెప్పడం మొదలుపెట్టిన పవన్… “అమరావతే రాజధాని అని చెప్పి.. లాంగ్ మార్చ్ చేద్దామనుకున్నాం. ఢిల్లీలోని బీజేపీ నాయకులు కూడా  అందుకు అంగీకరించారు. కానీ.. ఇక్కడికి వచ్చాక స్థానిక బీజేపీ నాయకులు అలాంటిదేమీ లేదన్నారు.” అని అన్నారు. అనంతరం మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఆయన… “నేను అనుకున్నట్లు జనసేన-బీజేపీ కార్యక్రమం జరిగిఉంటే.. “వైకాపా వ్యతిరేక ఓటు” అనే మాట నా నోటినుంచి వచ్చేది కాదు” అని పవన్ చెప్పుకొచ్చారు.

బీజేపీ తప్పులు చెప్పుకునే క్రమంలో మరో విషయం చెప్పారు పవన్. “మేము తెలంగాణలో జి.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో పోటీచేస్తామంటే.. నువ్వు ఆంధ్రా వాడివి, నువ్వు ఇక్కడెలా పోటీచేస్తావని స్థానిక బీజేపీ నాయకులు అన్నారు. ఫైనల్ కంక్లూజన్ ఇచ్చే క్రమంలో… “నేను బీజేపీకి అండగా నిలబడ్డా.. వారే ముందుకు తీసుకెళ్లడం లేదు”! అని చెప్పుకొచ్చారు పవన్!

దీంతో… తన చేతకాని తనాన్ని బీజేపీపై రుద్దుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు స్థానిక బీజేపీ కార్యకర్తలు. ఇదే సమయంలో… అసలు బీజేపీని పవన్ ఎందుకు ఉద్దరించాలనుకున్నట్లు? అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చినందుకా.. బీజేపీ అంటే అంత గౌరవం. స్టీల్ ప్లాంట్ అమ్మేస్థామంటున్నందుకా బీజేపీ అంటే అంత ప్రేమ!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… “బీజేపీకి అండగా నిలబడ్డాను – వారే ముందు తీసుకెళ్ళడం లేదు” అని అంటున్నారు పవన్. ఈయన వారికి అండగా ఉంటే… తీసుకెళ్లాల్సింది ఈయనే కదా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సవుతారో అర్ధం కాదు! పోని అదే నిజమనుకుంటే.., అలాంటప్పుడు… “నేను వారిని నమ్ముకున్నాను… వారు ముందుకు తీసుకెళ్లడం లేదు” అని చెబితే కరెక్ట్ గా ఉండేది కదా?

దీంతో… పవన్ సభ పెట్టిన ప్రతిసారీ సమాధానం లేని ఎన్నో ప్రశ్నలను ఇలా వదిలేసి వెళ్తుంటారని.. వాటిని ఎవరికి నచ్చినట్లు వారు ఫిల్ చేసుకుంటారని.. ఫలితంగా జనసేనకు కావాల్సినంత డ్యామేజ్ జరుగుతుంటుందని అంటున్నారు విశ్లేషకులు!

YouTube video player