అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే 95 శాతం ఎన్నికల హామీల్ని నెరవేర్చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. అవునా.? అది నిజమా.? అయితే, ఈ లిస్టు మాటేమిటి.. అంటూ జనసేన పార్టీ ఓ చాంతాడంత లిస్టుని తెరపైకి తెచ్చింది. ఉద్యోగుల సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం.. ఇలాంటి కీలక అంశాలన్నిటినీ అందులో జనసేన ప్రస్తావిస్తోంది.
తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా, మద్యపాన నిషేధం అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ర్యాగింగ్ చేశారు. ‘సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పారు, సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదించడమే నినాదంగా పెట్టుకున్నారు.. సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వాళ్ళవే.. ఆ అదనపు వేల కోట్లు ఆదాయం కూడా వారిదే..’ అంటూ వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు జనసేనాని.
అంతేనా, ‘సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు..’ అంటూ బైబిల్ కొటేషన్ కూడా జత చేశారు. ఇది నిజంగానే మాస్ ర్యాగింగ్ మరియు ట్రోలింగ్.! రాజకీయల్లో ఇలాంటివి చాలా చాలా వేగంగా జనంలోకి వెళ్ళిపోతాయ్.
మద్య పాన నిషేధం విషయంలో జగన్ సర్కారు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కాదు కాదు, ఆ మద్యపానం ద్వారా వచ్చే ఆదాయం మీదనే అమితంగా ఆధారపడుతోంది. ఏ నోటితో అయితే మద్య నిషేధం చేస్తానని వైఎస్ జగన్ చెప్పారో, అదే నోటితో ఆయన, ‘మద్యం ద్వారా ఆదాయం రాష్ట్రానికి రాష్ట్రానికి రాకపోతే సంక్షేమ పథకాలు నడవవు’ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు..
మొత్తమ్మీద, వచ్చే ఎన్నికల్లో మద్య నిషేధం అంశం వైసీపీకి పెద్ద తలనొప్పిలా మారేలా వుంది. అదొక్కటే కాదు, సీపీఎస్ రద్దు అంశం కూడా వైసీపీని ముంచేయనుంది.