జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వల్ల తనకు, తన పార్టీకి పొలిటికల్ గా కచ్చితంగా బెనిఫిట్ కలిగే విధంగా వ్యవహరిస్తుండటం హట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ వాహనం అయిన వారాహి ఆయన సొంతంగా డబ్బులు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనం కాదని తెలిసి ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. ఈ వాహనం రిజిస్ట్రేషన్ కూడా ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పేరుపై ఉంది.
ఈ వ్యక్తి వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున రాజమండ్రి నుంచి పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది. కోటి రూపాయల వాహనం కోసం పవన్ కళ్యాణ్ టికెట్ ఆశిస్తున్న వ్యక్తిపై ఆధారపడి ఉండటం కరెక్ట్ కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్న సహాయం విషయంలో కూడా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
కాపు కులానికి చెందిన ప్రజలు ఏ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారో ఆ నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ పర్యటనలు జరుగుతున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉండగా కొంతమంది ఆ ప్లానింగ్ ను మెచ్చుకుంటుంటే మరి కొందరు ఆ ప్లానింగ్ పై విమర్శలు చేస్తుండటం గమనార్హం.
సత్తెనపల్లిలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటనకు ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే క్లారిటీ లేదు. పవన్ పోటీ చేసే నియోజకవర్గంకు సంబంధించి అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.