ఓ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించుకున్నారు కదా.! మాటలు కూడా తన సినిమాలకు సంబంధించి ఒక్కోసారి ఆయనే రాసుకుంటుంటారు కదా.! సో, దాన్నే రాజకీయాల్లోనూ అప్లయ్ చేస్తున్నారా.? అబ్బే, అస్సలేమాత్రం బాగా లేదు వ్యవహారం.!
సినిమాల్లో విలన్‌ని తీసి పారేసినట్లు కుదరదు రాజకీయాల్లో.! రాజకీయాల్లో ఎవర్నీ తక్కువ చేసి చూడకూడదు.! సరే, ‘దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్’ అంటూ పవన్ కళ్యాణ్‌ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లైట్ తీసుకుంటున్న మాట వాస్తవం. అలాగని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ‘నువ్వెంత.? నీ బతుకెంత.?’ అని ప్రశ్నించడం తగునా.?
పవన్ కళ్యాణ్‌కి అసలు ఎవరు చెబుతున్నారు.. ఇలా మాట్లాడమని.? ఆయనే తనంతట తానుగా మాట్లాడుతోంటే, ఆయన మానసిక స్థితిపై అనుమానాలు ఖచ్చితంగా వస్తాయ్.! అంతే మరి, రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. తాను గెలిచి, తనతోపాటుగా మొత్తం 151 మంది ఎమ్మెల్యేలనీ, 22 మంది ఎంపీలనూ గెలిపించుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఇక్కడ ఎవరి బతుకెంత.? అన్నదానిపై రాష్ట్ర ప్రజలకు ఓ క్లారిటీ వుంది. గెలుపోటములు ఎవరికైనా సహజమే కావొచ్చు. గెలుపోటముల్ని బట్టి ఎవరి బతుకు ఏంటి.? అన్నది తేల్చడమూ సబబు కాదు.! కానీ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘అతి’ కారణంగా, ‘నువ్వెంత.? నీ బతుకెంత.?’ అన్న ప్రశ్న ఖచ్చితంగా ఎదురొస్తుంది.
ముదినేపల్లిలో వారాహి విజయ యాత్ర నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయ విమర్శలు చేశారు. తామే అధికారంలోకి వస్తామనీ అన్నారు. అక్కడి వరకూ పవన్ కళ్యాణ్‌ని తప్పు పట్టడానికేమీ లేదు. టీడీపీతో కలిస్తే తప్ప వైసీపీని ఓడించలేం.. అని చెబుతూ, ‘నువ్వెంత.? నీ బతుకెంత.?’ అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించడంలో విజ్ఞత ఏంటో పవన్ కళ్యాణ్‌కే తెలియాలి.