జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఉగ్రవాద సంస్థ అని పవన్ కామెంట్లు చేశారు. ఫ్యూడలిస్టిక్ కోటలు బద్ధలుగొడతాం అంటూ వైసీపీపై పవన్ వెల్లడించారు. ఇప్పటం బాధితులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన పవన్ జనసేనకు ఓట్లు వేసినా వేయకపోయినా అండగా ఉంటానని అన్నారు. మాది రౌడీ సేన కాదు విప్లవ సేన అని పవన్ తెలిపారు.
యువతకు మంచి చేసే నేతలు పాలకులుగా వస్తే బాగుంటుందని అభిమాన బలం ఉన్న నన్ను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటం ప్రజలకు వైసీపీ ఇబ్బందులు కలిగించడాన్ని తాను అస్సలు మరిచిపోనని పవన్ పేర్కొన్నారు. లంచాలు లేని వ్యవస్థను తీసుకొనిరావడం తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రాణం ఉన్నంత వరకు లంచాలు లేని వ్యవస్థ కోసం పోరాటం కొనసాగిస్తానని పవన్ చెప్పుకొచ్చారు.
తాటాకు చప్పుళ్లకు నేను భయపడనని ఆయన కామెంట్లు చేశారు. తాను కులాలను ద్వేషించనని పవన్ తెలిపారు. నన్ను ఎప్పుడూ నా కులంలో ఉన్న నేతలతోనే తిట్టిస్తారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీలో బ్రిటిష్ వాళ్ల గుణాలు ఉన్నాయని ఆయన అన్నారు. కులాలు దేహీ అనే ధోరణి నుంచి బయటకు రావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్రధానిని కలవనని నేనే చేస్తానని పవన్ పేర్కొన్నారు.
అయితే 2019 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కు ఎలాంటి ఫలితం దక్కిందో చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో కూడా పవన్ కు ఇదే ఫలితం దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. వైసీపీ టార్గెట్ గా రాజకీయాలు చేయకుండా ప్రజలకు బెనిఫిట్ కలిగేలా రాజకీయాలు చేస్తే వైసీపీకి మంచిదని చెప్పవచ్చు.