ప్రభుత్వంపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు… వాలంటీర్ల చేతిలో ఒంటరి మహిళల లిస్ట్!

ఎన్నిరోజులు సాగుతుంది, ఎన్ని సెలక్టివ్ నియోజకవర్గాల్లో ఉంటుందన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రస్తుతం ఏలూరులో మొదలైన వారాహి యాత్ర పార్ట్ – 2 వేడిగా మొదలైంది. పవన్ శృతిమించిన విమర్శలతో మరింత రచ్చ రచ్చగా మొదలైంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మైకందుకున్న పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అవును… ఏలూరు బహిరంగ సభలో పవన్ శృతిమించారనే స్థాయిలో విమర్శలు చేశారని విమర్శ తెరపైకి వచ్చింది. ఏలూరులో ప్రసంగించిన పవన్… ఏపీలో రూ.1.25లక్షల కోట్లు మద్యం ద్వారా ఆదాయం వస్తోందని అందులో 97వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వెళ్తోందని, మిగతాదంతా జగన్ జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు.

అనంతరం జగన్ ప్రతిపనికీ కమిషన్ తీసుకుంటున్నాడని చెప్పిన పవన్… జగన్ లా తనకు అడ్డగోలు సంపాదన లేదని, ఆయన నాన్నలా తన నాన్న సీఎం కాదని, ఆయనలాగా ప్రతి పనికీ తనకు 6 శాతం కమీషన్ రాదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇండియా టిక్‌ టాక్‌, చైనా ఫేస్‌ బుక్‌ బ్యాన్‌ చేశాయని, ఏపీలో మాత్రం జగన్ జీవోలను బ్యాన్ చేస్తున్నారని, జీవోలను బయటకు కనపడనీయడంలేదని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ ఒక మాట రెగ్యులర్ గా వాడుతున్నారు. అదేంటంటే… రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని. చిత్రంగా… ఈ విమర్శకు ప్రభుత్వం నుంచి కూడా ఎందుకోగానీ ప్రతిస్పందన వచ్చినట్లు కనిపించలేదు. దీంతో… ఏ సభలోనైనా పవన్ ఇదే విమర్శను కంటిన్యూ చేస్తున్నారు.

ఇందులో భాగంగా… రాష్ట్రంలో ఇప్పటి వరకూ 30వేలమంది మహిళలు అదృశ్యమయ్యారని, అందులో 14వేలమంది ఆచూకీ ఇంకా దొరకలేదని చెబుతున్న పవన్… గ్రామంలో ఎంతమంది మహిళలున్నారు, ఒంటరి మహిళలు ఎంతమంది, వితంతువులు ఎవరు.. అనే సమాచారమంతా వాలంటీర్ల ద్వారా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, తద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

పవన్ తనకున్న సహజమైన భయంతో క్లియర్ గా చెప్పి ఉండకపోవచ్చు కానీ.. వాలంటీర్ల ద్వారా అంటే… వాలంటీర్లే ఇస్తున్నారని అర్ధమని అంటున్నారు పరిశీలకులు. ఇలా అతితక్కువ జీతంతో నిత్యం గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండే వాలంటీర్లపై పవన్ ఇలా నోరు పారేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.

ఇదే సమయంలో పచ్చకల్లోడికి ప్రపంచమంతా పచ్చగా కనిపిస్తుందని.. ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకుని, వారికి అబార్షన్లు చేయించారనే విమర్శను ఎదుర్కొంటున్న పవన్ కి.. వాలంటీర్లు కూడా అలానే కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు వాలంటీర్లు! దీంతో పవన్ మరీ శృతిమించిన ఆరోపణలు చేశారని అంటున్నారు. ఈ సమయంలో చాలా మంది జనసైనికులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారన్న విషయాన్ని మరిచారని తెలుస్తుంది!!