నిన్నటిదాకా దత్త పుత్రుడు.! ఇకపై బినామీ.! పవన్‌పై రోజా కామెంట్స్.!

నిన్న మొన్నటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శలు చేసేవారు వైసీపీ నేతలు. ఇకపై ‘బినామీ’ అనే మాటని ఉపయోగిస్తారేమో.! వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా విశాఖ వేదికగా జనసేన అధినేత మీద ‘బినామీ’ అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకి అవసరమైన ప్రతిసారీ పవన్ కళ్యాణ్ చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేస్తారన్నది రోజా ఆరోపణ.

విశాఖ వేదికగా నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. పేరుకే అక్కడ నాన్ పొలిటికల్ జేఏసీ.. మొత్తం వ్యవహారాన్ని నడిపించింది వైసీపీనే. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదంతో గత కొంతకాలంగా రాష్ట్రంలో రాజధాని వ్యవహారాన్ని అయోమయంలో పడేసిందన్నది నిర్వివాదాంశం.

ముందైతే ఒక్కటన్నా అభివృద్ధి చెందాలి కదా.? అన్న కనీస సోయని పక్కన పడేసి, మూడు రాజధానులు అంటోన్న వైసీపీ, తన పంతాన్ని నెగ్గించుకునే క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజల్ని రాజధాని నినాదం వైపుగా ఉసిగొల్పుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ‘గర్జన’ కార్యక్రమం జరిగింది.

వైసీపీకి చెందిన కీలక నేతలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఈ గర్జనలో పాల్గొన్నారు. రోజా సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. టీడీపీ మీదా, జనసేన మీదా తన సహజ శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే, ‘చంద్రబాబు బినామీ పవన్ కళ్యాణ్..’ అంటూ ఆమె చేసిన విమర్శ కాస్తా మిస్ ఫైర్ అవుతోంది. గతంలో టీడీపీలో రోజా పని చేశారు. ఆ లెక్కన, పవన్ కళ్యాణ్ కంటే ముందు రోజానే చంద్రబాబుకి బినామీ అవుతారు కదా.?