ఏ పార్టీని నమ్మలేకపోతున్న పవన్.. మోసపోతాననే భయమే కారణమా?

pawan-kalyan

2014 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రకటించడం జరిగింది. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేకపోవడంతో జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చింది. అయితే ఆ సమయంలో టీడీపీ గెలుపుకు జనసేన కారణమని కామెంట్లు వినిపించాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ పార్టీని నమ్మలేకపోతున్నారు. ఏ పార్టీని నమ్మినా ఇబ్బందేనని ఆయన భావిస్తున్నారు.

మరోవైపు జనసేన 35 స్థానాలను ఆశిస్తుండటంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చంద్రబాబు 35 స్థానాలను జనసేనకు ఇచ్చినా ఓడిపోయే నియోజకవర్గాలను మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తన కోసం టీడీపీ తగ్గాలని పవన్ కోరుకుంటున్నారు. టీడీపీతో ముందుకెళ్లడం కంటే బీజేపీతో ముందుకెళ్లడం మంచిదని ఆయన భావిస్తున్నారు.

అయితే పవన్ చివరి నిమిషంలో పొత్తులను ప్రకటించడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. టీడీపీతో పొత్తును చివరి నిమిషంలో ప్రకటించాలని పవన్ భావిస్తున్నా ఈ నిర్ణయం రైట్ కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పాలిటిక్స్ విషయంలో పవన్ ఏం చేయాలని అనుకుంటున్నా భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఆయన కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్యూజ్ చేస్తున్నారు. చంద్రబాబు సైతం పొత్తులపై నోరు మెదపటానికి ఇష్టపడటం లేదు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే జనసేనకు నష్టం కలుగుతుందా? అని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.