పవన్ జాతకం బాలేదా.. ఆయనకు అనుకూల ఫలితాలు రావడం లేదా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయనకు అనుకూల ఫలితాలు రావడం లేదు. ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ కు రెండు చోట్ల ఊహించని షాక్ తగిలింది. 2014లో టీడీపీ పవన్ కళ్యాణ్ వల్లే అధికారంలోకి వచ్చినా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే సంగతి తెలియనిది కాదు. పవన్ కళ్యాణ్ జాతకం బాలేదని అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

2024 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కు అనుకూల ఫలితాలు రావడం తేలికైతే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన 2024 ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తుందో వెల్లడించాల్సి ఉంది. అదే సమయంలో జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో కూడా చెబితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పొలిటికల్ గా లోకేశ్ పరిస్థితి ఎలా ఉందో పవన్ పరిస్థితి దాదాపుగా అదే విధంగా ఉంది.

టీడీపీ, జనసేన కలిసినా ఏపీలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని వైసీపీ భావిస్తోంది. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల సంఖ్య 4 లక్షలు కాగా ఈ 4 లక్షల ఉద్యోగుల కుటుంబాలు సైతం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన కలిసినా వైసీపీని ఓడించలేకపోతే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే ఛాన్స్ కూడా లేదు.

టీడీపీ జనసేన కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలకు బీజేపీ నుంచి సహాయసహకారాలు లభించడం కష్టమేనని తెలుస్తోంది. 11వ తేదీన జరిగే మోదీ సభను సక్సెస్ చేయడం కోసం వైసీపీ ఎంతో కష్టపడుతోంది. 2024 ఎన్నికల ఫలితాలు పార్టీకి అనుకూలంగా వస్తాయో వ్యతిరేకంగా వస్తాయో చూడాల్సి ఉంది.