2024 ఎన్నికల్లో పవన్ గెలవడం సాధ్యం కాదా.. ఆ కన్ఫ్యూజన్ ఎందుకో?

Pawan-Kalyan-Delhi-BJP

2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా పవన్ కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారని అందరూ భావించారు. పవన్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీడీపీ సైతం తన వంతు సహాయసహకారాలు అందించిందని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. పవన్ ఎంత కష్టపడినా ఎన్నికల్లో ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదు. అయితే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడం గ్యారంటీ అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎన్నికల్లో గెలవడం కోసం ఇప్పటికే అనేక సర్వేలు చేయించిన పవన్ కళ్యాణ్ కు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే జనసేనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సమాచారం అందింది. నియోజకవర్గం విషయంలో పవన్ కు ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. అయితే పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఆయనను ఓడించాలని వైసీపీ ప్లాన్ ను సిద్ధం చేసుకుందని సమాచారం. పవన్ ఎన్నికల్లో గెలిస్తే ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

పవన్ ఎక్కడ సభలు నిర్వహించినా లక్షల సంఖ్యలో జనం ఆయన సభలకు హాజరవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఓట్లు వేయడానికి మాత్రం ఆ స్థాయిలో జనం రావడం లేదు. 2014 ఎన్నికల్లో పవన్ ను నమ్మిన జనం ఇప్పుడు మాత్రం ఆయనను నమ్మడం లేదు. పవన్ అభిమానులే పలు ప్రాంతాల్లో జగన్ కు సపోర్ట్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ ను అభిమానిస్తాం జగన్ కు ఓటేస్తామని కొంతమంది చెబుతున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ను అభిమానించే వాళ్లలో ఎక్కువ మంది ఓటు హక్కు లేని వాళ్లు అనే సంగతి తెలిసిందే. పవన్ కు ఏ విధంగా చూసినా నెగిటివ్ గానే జరుగుతుంది. జనసేన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతాయని పవన్ భావిస్తున్నారు. అయితే ఆ పొత్తు వల్ల పవన్ కు పాజిటివ్ గా జరిగే అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయో నెగిటివ్ గా జరిగే అవకాశాలు అదే స్థాయిలో ఉన్నాయి.