ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్న తప్పు చేసినా పవన్ కళ్యాణ్ చేసే హడావిడి మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. జగన్ పై విమర్శలు చేసే విషయంలో ముందువరసలో ఉండే పవన్ చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా విమర్శించడానికి ఇష్టపడరు. తాజాగా గుంటూరులో జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పవన్ కళ్యాణ్ స్పందనను చూసి నవ్వడ పొలిటికల్ వర్గాల వంతవుతోంది.
పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చిపై నోరు మెదపడానికి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ లో ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. మహిళలు చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని కోరుకుంటున్నానని పవన్ అన్నారు.
మృతుల కుటుంబానికి పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేయడంతో పాటు వరుసగా చోటు చేసుకుంటున్న దుర్ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. చంద్రబాబుకు రాజకీయంగా ఎలాంటి నష్టం జరగకుండా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సభల విషయంలో కూడా ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇతర పార్టీల నుంచి విమర్శలు రాకూడదని పవన్ స్పందించారే తప్ప పవన్ స్పందనలో ప్రజలపై ప్రేమ కనిపించడం లేదని మరి కొందరు చెబుతున్నారు. జనసేన పార్టీ తరపున పవన్ కూడా కొంతమేర ఆర్థిక సహాయం ప్రకటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు తప్పులు పవన్ కు కనపడవని నెటిజన్ల నుంచి పవన్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.